SCR Cancelled Trains: తుఫాన్ ఎఫెక్ట్ తో పెద్ద ఎత్తున రైళ్లు ర‌ద్దు చేసిన ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే, ఏయే రూట్ల‌లో ట్రైన్లు ర‌ద్దు చేశారంటే?

ఈ నెల మూడో తేదీ నుంచి ఆరో తేదీ వ‌ర‌కూ ఈ రైలు స‌ర్వీసులు ర‌ద్దు చేశామ‌ని, ప్రయాణికులు గ‌మ‌నించాల‌ని కోరారు. మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రాకేశ్ తెలిపారు.

Credits: ANI

Hyderabad, December 02: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మ‌ధ్య రైల్వే (SCR) అల‌ర్ట్ జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తీవ్ర అల్ప పీడ‌నం (Cyclone Michaung) శుక్ర‌వారం వాయుగుండంగా మారి.. ఆదివారానికి తుపానుగా బ‌ల ప‌డ‌నున్నది. ఈ తుఫాన్‌కు మిచౌంగ్ అని భార‌త వాతావ‌ర‌ణ విభాగం పేర్కొంది. దీంతో ఆదివారం, సోమ‌వారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తేలిక‌పాటి జ‌ల్లుల నుంచి మోస్తరు వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.

 

ఆదివారం మిచౌంగ్ తుపాన్ తీరాన్ని దాటనున్న నేప‌థ్యంలో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (SCR) ప‌రిధిలో తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 142 రైళ్లు ర‌ద్దు చేశామ‌ని (Trains Cancelled) సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ చెప్పారు. ఈ నెల మూడో తేదీ నుంచి ఆరో తేదీ వ‌ర‌కూ ఈ రైలు స‌ర్వీసులు ర‌ద్దు చేశామ‌ని, ప్రయాణికులు గ‌మ‌నించాల‌ని కోరారు. మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రాకేశ్ తెలిపారు.