SCR Increases Platform Ticket Rate: ఫ్లాట్‌ఫాం మీదకు ఎక్కితే బాదుడే, భారీగా రేట్లను పెంచిన దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రూ.50కి పెరిగిన ఫ్లాట్‌ఫాం టికెట్ రేటు

ప్రయాణికులతో పాటూ, వారి బంధువులు కూడా రైల్వే స్టేషన్లలోకి రాకుండా ఉండేందుకు ఫ్లాట్‌ ఫాం టికెట్ల రేట్ల(increases platform ticket rate)ను పెంచింది. సంక్రాంతి(Sankranthi) సందర్భంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోతోంది. దీంతో ఫ్లాట్‌ ఫాం టికెట్ల ధరలను భారీగా పెంచారు.

Representative Image (Photo Credits: Unsplash)

Hyderabad January 09: రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే(South Central Railway). ప్రయాణికులతో పాటూ, వారి బంధువులు కూడా రైల్వే స్టేషన్లలోకి రాకుండా ఉండేందుకు ఫ్లాట్‌ ఫాం టికెట్ల రేట్ల(increases platform ticket rate)ను పెంచింది. సంక్రాంతి(Sankranthi) సందర్భంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోతోంది. దీంతో ఫ్లాట్‌ ఫాం టికెట్ల ధరలను భారీగా పెంచారు. ఈ ధరలను ఈనెల 20వ తేదీ వరకు అమలు చేయనున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేశ్‌ తెలిపారు.

South Central Railway: రైళ్లలో ఇక రిజర్వేషన్ అవసరం లేదు, నేరుగా స్టేషన్‌లోనే కొని జనరల్ బోగీల్లో ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించిన దక్షిణ మధ్య రైల్వే, పూర్తి వివరాలు కథనంలో..

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ప్లాట్‌ఫాం టికెట్‌ ధర రూ.10 నుంచి రూ.50వరకు పెంచారు. నాంపల్లి, కాచిగూడ(Kachiguda), వరంగల్‌(Warangal), ఖమ్మం, లింగంపల్లి, కాజీపేట్, మహబూబ్‌నగర్‌, రామగుండం, మంచిర్యాల, భద్రాచలం, వికారాబాద్‌, తాండూర్‌, బీదర్‌, బేగంపేట్‌ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్‌ ధరలను రూ.10 నుంచి రూ.20వరకు పెంచారు. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వేశాఖ తెలిపింది.