Hyderabad, August 24: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగీల్లో ప్రయాణం చేసేందుకు అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రిజర్వేషన్ ఉంటేనే రైలులో ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండడంతో రైల్వేశాఖ (South Central Railway) సడలింపులు ఇస్తోంది. ఇకపై జనరల్ బోగీ ప్రయాణానికి రిజర్వేషన్ అవసరం లేదని పేర్కొంది.
తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్లలోని జనరల్ బుకింగ్ కౌంటర్లలో అన్‌రిజర్వుడ్ టికెట్ (Unreserved Tickets from General Booking Counter) కొనుగోలు చేసి ప్రయాణం చేసుకోవచ్చు. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోని 74 రైళ్లలో జనరల్ బోగీలను రిజర్వేషన్ నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపింది. ఇందులో సికింద్రాబాద్ డివిజన్‌లో 29, విజయవాడ డివిజన్‌లో 12, నాందేడ్‌లో 12, గుంతకల్లులో 10, హైదరాబాద్‌లో ఆరు, గుంటూరులో ఐదు రైళ్లు ఉన్నాయి. టికెట్లు ఆయా స్టేషన్ల పరిధిలో లభిస్తాయి. అలాగే UTS Mobile App ద్వారా కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
Here's South Central Railway Tweet
De-reservation of General Coaches on Spl. Trains Originating & Terminating on SCR from the dates shown against each Train.
For boarding these Coaches, Passengers can purchase Unreserved Tickets from General Booking Counter available at Stations and also through UTS Mobile App pic.twitter.com/vJOaPN5OiS
— South Central Railway (@SCRailwayIndia) August 23, 2021
ఈ నిర్ణయం ఈ నెల 24 నుంచి దశలవారీగా అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ - పూర్ణ రైలులో మాత్రం 22 నుంచి అమలు చేస్తున్నామని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. జోన్ పరిధిలోని 74 రైళ్లలో జనరల్ బోగీలను రిజర్వేషన్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.