Rail Coach Restaurant: హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో 'రైల్ కోచ్ రెస్టారెంట్'... దక్షిణ మధ్య రైల్వే వినూత్న కార్యాచరణ.. బోగీలో వివిధ రకాల వంటకాలతో వినియోగదారులకు సేవలు

ఇక్కడికి నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్ కోచ్ రెస్టారెంట్ (Rail Coach Restaurant) ను ప్రారంభించింది.

Credits: X

Hyderabad, Sep 12: హైదరాబాద్ (Hyderabad) లోని ప్రముఖ పర్యాటక స్థలాల్లో నెక్లెస్ రోడ్ (Necklace Road) ఒకటి. ఇక్కడికి నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్ కోచ్ రెస్టారెంట్ (Rail Coach Restaurant) ను ప్రారంభించింది. వినియోగంలో లేని రైలు బోగీని రెస్టారెంట్ తరహాలో ఆధునికీకరించారు. వినియోగదారులకు సరికొత్త అనుభూతినిచ్చేలా అన్ని హంగులతో ఈ రెస్టారెంట్ ను తీర్చిదిద్దారు. చూపులకు మాత్రమే కాదు, రుచుల పరంగానూ ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ అదరహో అనిపిస్తుంది.

Nipah Virus: డేంజర్ బెల్స్.. కరోనా విలయం పూర్తయిందో లేదో.. మరో భయం.. కేరళలో రెండు అసహజ మరణాలు.. నీపా వైరస్ కారణమని అనుమానాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం

మెనూలో ఏం ఉంటాయంటే?

ఇక్కడి మెనూలో అనేక సుప్రసిద్ధ వంటకాలకు చోటుకల్పించారు. నగరానికి చెందిన బూమరాంగ్ రెస్టారెంట్ కు ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. చిరుతిళ్లు, అల్పాహారాలు, భోజనం, ఇతర రకాల వంటకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. పార్శిల్ సదుపాయం కూడా ఉంది.

Nipah Virus: డేంజర్ బెల్స్.. కరోనా విలయం పూర్తయిందో లేదో.. మరో భయం.. కేరళలో రెండు అసహజ మరణాలు.. నీపా వైరస్ కారణమని అనుమానాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం