Credits: X

Newdelhi, Sep 12: కరోనా (Corona) విలయం పూర్తయిందో లేదో.. మరో భయం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కేరళలోని (Kerala) కోజీకోడ్ (Kozhikodes) జిల్లాలో రెండు అసహజ మరణాలు సంభవించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నీపా వైరస్ (Nipah Virus) కారణంగా బాధితులు మరణించారన్న అనుమానాల నడుమ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ సోమవారం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ మరణాలు సంభవించినట్టు ప్రభుత్వం పేర్కొంది. మృతుల బంధువు ఒకరు అనారోగ్యం కారణంగా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు కూడా వెల్లడించింది. దక్షిణ భారతంలో తొలి నిపా వైరస్ కేసు 2018లో కోజీకోడ్ జిల్లాలోనే బయటపడటం తెలిసిందే.

RTS Bus Stolen: ఇదేందయ్యా.. ఇది.. మేమెప్పుడూ చూడాలే.. ఆర్టీసీ బస్సు చోరీ చేసి డ్రైవర్‌ అవతారమెత్తిన దొంగ.. ప్రయాణికులు టిక్కెట్లకు ఇచ్చిన డబ్బుతో పరార్.. సిరిసిల్ల జిల్లాలో సోమవారం వెలుగు చూసిన ఘటన..

ఇన్‌ఫెక్షన్ ఎలా వ్యాపిస్తుంది అంటే?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, జంతువుల ద్వారా మనుషులకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం లేదా వ్యాధి బారినపడ్డ వారి సమీపంలోకి వెళితే ఇన్‌ఫెక్షన్ బారిన పడతారు. నీపా వైరస్ రోగుల్లో కొందరికి ఎటువంటి లక్షణాలు ఉండవు. మరికొందరిలో మాత్రం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కనిపిస్తే, ఇంకొందరు ప్రాణాంతకమైన మెదడువాపు బారినపడతారు.

Asia Cup India vs Pakistan: పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం, 228 పరుగుల తేడాతో పాక్‌పై భారత్ గెలుపు..