Dussehra Special Trains & Busses: దసరాకు ఊరెళ్తున్నారా? తెలంగాణలో 4వేలు, ఏపీలో వెయ్యికి పైగా ప్రత్యేక సర్వీసులు, స్పెషల్ ట్రైన్లు నడిపిస్తున్న రైల్వే, స్పెషల్ సర్వీసుల టైమింగ్స్ మీకోసం, ఈ వివరాలు తెలుసుకొని బయల్దేరకపోతే జేబుకు చిల్లు ఖాయం

ప్రత్యేక బస్సుల్లో ఈ సారి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు. తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ప్రత్యేకంగా 4,198 బస్సులు నడుపుతుండగా, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ (APSRTC) హైదరాబాద్‌ నుంచి 1,090 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇన్ని వేల బస్సులు నడుపుతున్నప్పటికీ వేలాది మందికి బస్సుల్లో సీట్లు దొరకడం లేదు.

Telangana RTC Strike | (Photo-PTI)

Hyderabad, SEP 30: దసరా (Dussehra) పండుగ నేపథ్యంలో సెలవులు దొరకడంతో హైదరాబాద్‌ (Hyderabad) నుంచి లక్షలాది మంది ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. ప్రత్యేక బస్సులు, రైళ్లు నడుపుతున్నా టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రైవేట్‌ బస్సుల (private buses) ఆపరేటర్లు రేట్లను రెండు, మూడు రెట్లు పెంచి దోపిడీ చేస్తున్నారు. ఆర్టీసీ దసరా పండుగ ప్రత్యేక బస్సుల్లో ఈ సారి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు. తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ప్రత్యేకంగా 4,198 బస్సులు నడుపుతుండగా, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ (APSRTC) హైదరాబాద్‌ నుంచి 1,090 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇన్ని వేల బస్సులు నడుపుతున్నప్పటికీ వేలాది మందికి బస్సుల్లో సీట్లు దొరకడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో అప్పుడే సీట్ల రిజర్వేషన్లు దొరకడం లేదు. తెలంగాణలో దసరాను అతిపెద్ద పండుగగా జరుపుకుంటారు. సొంతూళ్లకు ప్రజలు వెళ్తుండడంతో హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. నగరంలోని రహదారులపై వాహనాల సంఖ్య తగ్గిపోయింది. ట్రాఫిక్‌ రద్దీ కన్పించడం లేదు.

Tirupati: తిరుపతిలో గోడలపై దేవతామూర్తుల బొమ్మలు తొలగించారన్నది అవాస్తవం, నగరంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయని తెలిపిన మునిసిప‌ల్ కార్పొరేష‌న్ 

మరోవైపు దసరా పండుగ సందర్భంగా ప్రయా‌ణి‌కుల రద్దీ నేప‌థ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లు (Special trains) నడుపుతున్నది. సికింద్రా‌బాద్‌-తిరు‌పతి (02764) రైలు అక్టో‌బర్‌ 1న రాత్రి 8.05 గంట‌లకు సికిం‌ద్రా‌బా‌ద్‌లో బయ‌లు‌దేరి మరు‌సటి రోజు ఉదయం 9 గంట‌లకు తిరు‌పతి చేరు‌కుం‌టుంది. తిరుగు ప్రయా‌ణంలో అక్టో‌బర్‌ 2న (02763) సాయంత్రం 5 గంట‌లకు తిరు‌ప‌తిలో (tirupati) బయ‌ల్దేరి 3న ఉదయం 5.45 గంట‌లకు సికిం‌ద్రా‌బాద్‌ చేరు‌కుం‌టుంది. ఈ రైలు జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబ్‌నగర్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

KCR to Yadadri: నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్ దంపతులు.. స్వర్ణతాపడానికి కిలో 16 తులాల బంగారం సమర్పణ.. మధ్యాహ్నం 3.30 గంటలకి హైదరాబాద్ తిరుగు ప్రయాణం 

సికిం‌ద్రా‌బాద్‌– యశ్వం‌త్‌‌పూర్‌ (07233) రైలు అక్టో‌బర్‌ 6, 13, 20 తేదీల్లో సికింద్రా‌బాద్‌ నుంచి రాత్రి 9.45కి బయ‌ల్దేరి మరు‌సటి రోజు ఉదయం 10.45 గంట‌లకు యశ్వం‌త్‌‌పూర్‌ చేరు‌కుం‌టుంది. తిరుగు ప్రయా‌ణంలో (07234) ఈనెల 30, అక్టో‌బర్‌ 7, 14, 21 తేదీల్లో యశ్వం‌త్‌‌పూ‌ర్‌లో మధ్యాహ్నం 3.50కి బయ‌ల్దేరి తెల్లారి సాయంత్రం 4.15 గంట‌లకు సికిం‌ద్రా‌బాద్‌ చేరు‌కుం‌టుంది. నర్సాపూర్-సికింద్రాబాద్-నర్సాపూర్ మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు వెల్లడించారు. నరసాపూర్-సికింద్రాబాద్ (నంబర్‌ 07466) రైలు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్-నర్సాపూర్ (నంబర్‌ 07467) రైలు అక్టోబర్ 1వ తేదీ రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు నర్సాపూర్ స్టేషన్‌కు చేరుతుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

IPL 2025 Schedule: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇక పండుగే! ఐపీఎల్ -2025 షెడ్యూల్‌ వచ్చేసింది, హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే?

New Delhi Railway Station Stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం..బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్ గౌడ్

Delhi Railway Station Stampede Update: ఢిల్లీ రైల్వేస్టేషన్‌ తొక్కిసలాట ఘటనలో 18 మంది మృతి.. ఎక్స్‌ గ్రేషియా ప్రకటించిన రైల్వే శాఖ.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం

Delhi Railway Station Stampede Update: మహాకుంభమేళా రద్దీ నేపథ్యంలో ఢిల్లీ రైల్వేస్టేషన్‌ లో భారీ తొక్కిసలాట ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య.. మరో 30 మందికి పైగా గాయాలు.. మృతుల్లో నలుగురు చిన్నారులు.. 11 మంది మహిళలు.. స్టేషన్ లో భయానక దృశ్యాలు (వీడియో)

Share Now