Secunderabad Fire Accident: డెక్కన్ స్టోర్ ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు, ఆందోళన కలిగిస్తున్న బిల్డింగ్ లోపలపేలుడు శబ్దాలు, దాదాపు 4 గంటలకు పైగా సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
సికింద్రాబాద్ పరిధిలో గల రామ్‌గోపాల్‌పేట్‌లోని డెక్కర్ స్టోర్ భవనంలో చెలరేగిన మంటలు (Secunderabad Fire Accident) ఇంకా అదుపులోకి రాలేదు.మంటలు ఆరవ అంతస్తు నుంచి రెండో అంతస్తుకు కూడా ( massive fire breaks out) వ్యాప్తించాయి.
Hyd, Jan 19: సికింద్రాబాద్ పరిధిలో గల రామ్‌గోపాల్‌పేట్‌లోని డెక్కర్ స్టోర్ భవనంలో చెలరేగిన మంటలు (Secunderabad Fire Accident) ఇంకా అదుపులోకి రాలేదు.మంటలు ఆరవ అంతస్తు నుంచి రెండో అంతస్తుకు కూడా ( massive fire breaks out) వ్యాప్తించాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటల కారణంగా భవనమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఘటనా స్థలానికి చేరకున్న 10 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం (rescue-operation-continues) చేస్తున్నాయి. డెక్కన్ స్టోర్ బిల్డింగ్ లోపల నుంచి పేలుడు శబ్దాలు వినిపించడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రమాద స్థలంలో దాదాపు 4 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. అయితే, అగ్ని ప్రమాద భవనానికి దాదాపు 100 మీటర్ల దూరంలోనే కిమ్స్ ఆసుపత్రి ఉన్నట్టు తెలుస్తోంది. డెక్కర్ స్టోర్ నుంచి పొగలు ఆసుపత్రికి వరకు వెళ్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించారు. ఈ పరిస్థితులు ఇలా ఉంటే డెక్కర్ స్టోర్ నుంచి మంటలు పక్కనే ఉన్న మరో నాలుగు భవానాలకు వ్యాప్తి చెందాయి.
మంటలు ఎంతకు అదుపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల ఇళ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ఆ ప్రాంతంలో మంటలు, తీవ్రమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్రమైన పొగ కారణంగా ఫైర్ సిబ్బంది కూడా అస్వస్థతకు గురయ్యారు. కాగా, మంటల భయంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.
రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ చీఫ్ విశ్వజిత్ మీడియాతో మాట్లాడుతూ... భవనం దగ్గరికి ఫైర్ ఇంజిన్లు వెళ్లే పరిస్థితి లేదన్నారు. అందుకే రెస్య్కూ ఆపరేషన్ ఆలస్యం అవుతుందన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చుట్టుపక్కల వారిని ఖాళీ చేయిస్తున్నట్టు తెలిపారు. అవసరమైనే బిల్డింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. మంటలు అదుపులోకి రావడానికి మరిన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మంటలు ఇలాగే చెలరేగితే భవనం కూలిపోయే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.
ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహాయక చర్యలను పరిశీలించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఫైర్ సిబ్బంది నాలుగురు వ్యక్తులను కాపాడారు. మరో ఇద్దరు లోపల ఉన్నట్టు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది అని స్పష్టం చేశారు.