సికింద్రాబాద్ లోని డెక్కన్‌ స్టోర్‌లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది మంటల కారణంగా భవనంలో దట్టమైన పొగ అలుముకుంది. భవనం ఆరో అంతస్తులో మంటలు చెలరేగి కింద వరకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు.దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కాగా, మొదటి అంతస్తులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కాసేపటి క్రితమే గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కూడా మంటలు చేలరేగాయి.. మంటలు కాస్తా పక్కనే ఉన్న మరో​ భవనానికి వ్యాపించాయి. ఘటనా స్థలంలో మూడు గంటలుగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)