Encounter in Telangana: తెలంగాణ దండకారణ్యంలో అలజడి.. ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలో భారీ ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చల్పాక సమీప అడవుల్లో మావోయిస్టు – గ్రేహౌండ్స్ బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
Hyderabad, Dec 1: తెలంగాణలోని (Telangana) దండకారణ్యం కాల్పులతో దద్దరిల్లింది. ములుగు (Mulugu) జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలో భారీ ఎన్‌కౌంటర్ (Encounter in Telangana) జరిగింది. చల్పాక సమీప అడవుల్లో మావోయిస్టు – గ్రేహౌండ్స్ బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ భారీ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్ట్ కీలక నేత బద్రు కూడా ఉన్నట్టు సమాచారం. ఆయనతోపాటు మృతుల్లో మరికొందరు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు భారీ కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే చల్పాక సమీప అడవుల్లో పోలీసు జవాన్లకు.. మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులపైకి కాల్పులు జరపడంతో గ్రేహౌండ్స్ బలగాలు ఎదురు కాల్పులు జరిపినట్టు సమాచారం.
ఇన్ఫార్మార్ల నెపంతో..
సరిగ్గా వారం రోజుల క్రితం ఇన్ఫార్మార్ల నెపంతో ఇద్దరు ఆదివాసీలను మావోయిస్టులు హత్య చేశారు. ఈ క్రమంలోనే అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి.
తీరం దాటిన ఫెంగల్ తుఫాన్, తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం