Shilpa Flyover Ready: హైదరాబాద్‌లో శిల్పా ఫ్లై ఓవర్ రెడీ.. నేడు కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభం.. రూ. 250 కోట్ల వ్యవయంతో బ్రిడ్జి నిర్మాణం.. ట్రాఫిక్ కష్టాలకు ఇక చెల్లు

250 కోట్ల వ్యయంతో నిర్మించిన శిల్పా లేఅవుట్ మొదటి దశ ఫ్లై ఓవర్‌ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు.

Shilpa Flyover (Credits: Facebook)

Hyderabad, Nov 25: హైదరాబాద్‌లో (Hyderabad) రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ (Traffic) కష్టాలతో ఉసూరుమంటున్న నగరవాసులకు గుడ్ న్యూస్ (Good News). నేటి నుంచి మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఐటీ కారిడార్‌ను (IT) ఓఆర్ఆర్‌తో (ORR) అనుసంధానం చేస్తూ రూ. 250 కోట్ల వ్యయంతో నిర్మించిన శిల్పా లేఅవుట్ (Shilpa Layout) మొదటి దశ ఫ్లై ఓవర్‌ (Flyover)ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (KTR) నేడు ప్రారంభించనున్నారు. ఐకియా మాల్ వెనక మొదలయ్యే ఈ బ్రిడ్జ్ అటు ఇటు ఉన్న 30 అంతస్తుల ఎత్తయిన భవనాల మధ్య నుంచి సాగిపోతూ ఓఆర్ఆర్ పైకి చేరుతుంది.

వేతన జీవులకు శుభవార్త.. వేతన సీలింగ్ సవరణకు ఈపీఎఫ్‌వో రెడీ.. వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ. 21 వేలకు పెంచే యోచన.. 75 లక్షల మందికి లబ్ధి.. రిటైర్మెంట్ సమయంలో పెద్దమొత్తంలో ఉద్యోగుల చేతికి సొమ్ము

నగరంలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరిగిపోతుండడంతో ఓఆర్ఆర్ పైకి వాహనాలు చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు కళ్లెం వేసేందుకు శిల్పా లే అవుట్ వరకు చేపట్టిన నాలుగు వరుసల ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని చేపట్టారు. వచ్చే నెలాఖరులో కొండాపూర్ చౌరస్తా వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇక, అవుటర్ రింగురోడ్డు నుంచి గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మీదుగా బొటానికల్ గార్డెన్ రోడ్డుపైకి నిర్మిస్తున్న శిల్పా లే అవుట్ రెండో దశ ప్రాజెక్టు వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి అవుతుంది.

ఇటీవల కన్నుమూసిన తండ్రి కృష్ణను తలచుకొంటూ మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్.. ‘ఇప్పుడు నాకు భయం లేదు నాన్నా’ అంటూ భావోద్వేగ సందేశం

రెండు అంతస్తులుగా నిర్మించిన ఈ వంతెనకు చాలా ప్రత్యేకతలున్నాయి.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif