Shock to Narayana: అమెరికా విమానాశ్రయంలో సీపీఐ అగ్రనేత నారాయణకు చేదు అనుభవం.. అమెరికా వీసా ఉన్నా విచారణ కోసం ఆపేసిన ఇమిగ్రేషన్ అధికారులు.. ఫోన్‌లో క్యూబా దేశాధ్యక్షుడితో దిగిన ఫోటోను చూసి నారాయణను సుమారు 6 గంటలపాటు అక్కడే నిలిపేసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది
ఫ్లోరిడా విమానాశ్రయంలో ఆయన ప్రయాణ వివరాలను అడిగిన సిబ్బంది... ఫోన్‌లో క్యూబా దేశాధ్యక్షుడితో దిగిన ఫోటోను చూసి సుమారు 6 గంటలపాటు అక్కడే ఆపారు.
Newyork, November 1: కమ్యూనిస్ట్ పార్టీ (Communist Party) సమావేశాల్లో పాల్గొనేందుకు క్యూబా (Cuba) వెళ్లిన సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి కె.నారాయణను ఫ్లోరిడా (Florida) విమానాశ్రయంలో (Airport) ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. పార్టీ సమావేశాల అనంతరం క్యూబా రాజధాని హవానా నుంచి పెరూ వెళ్తూ మార్గమధ్యంలో ఫ్లోరిడాలో నారాయణ ఆగారు. ఫ్లోరిడా విమానాశ్రయంలో ఆయన ప్రయాణ వివరాలను అడిగిన సిబ్బంది... ఫోన్‌లో క్యూబా దేశాధ్యక్షుడితో దిగిన ఫోటోను చూసి సుమారు 6 గంటలపాటు అక్కడే ఆపారు.
నారాయణ వద్ద అమెరికా వీసా ఉన్నప్పటికీ ముందుకెళ్లకుండా విచారణ నిమిత్తం ఆపివేశారు. అనంతరం పూర్తి వివరాలు తెలుసుకుని వదిలేసినట్టు నారాయణ తెలిపారు. సోమవారం రాత్రి మీడియాకు పంపిన సందేశంలో ఆయన ఈ వివరాలను తెలిపారు.