Investment in Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి, రూ. 350 కోట్లు పెట్టుబడి పెట్టిన సింటెక్స్ కంపెనీ, రంగారెడ్డి జిల్లాలో ప్రారంభం

సింటెక్స్ (Sintex) కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నది. వెల్ప్‌న్‌ గ్రూప్ (Welson) కంపెనీ భాగస్వామిగా కొనసాగుతున్న సింటెక్స్ రూ.350 కోట్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) తెలిపారు. కంపెనీ పెట్టుబడితో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి

Telangana IT Minister KTR (PIC @ FB)

Hyderabad, SEP 23: తెలంగాణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. సింటెక్స్ (Sintex) కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నది. వెల్ప్‌న్‌ గ్రూప్ (Welson) కంపెనీ భాగస్వామిగా కొనసాగుతున్న సింటెక్స్ రూ.350 కోట్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) తెలిపారు. కంపెనీ పెట్టుబడితో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో సింటెక్స్ తయారీ యూనిట్‌ నెలకొల్పబోతుండగా.. ఇందులో సింటెక్స్ వాటర్ ట్యాంకులను, ప్లాస్టిక్ పైపులను, ఆటో కాంపోనెంట్స్ తదితర ఉత్పత్తులను తయారు చేయనున్నది. ప్లాంట్ నిర్మాణానికి ఈ నెల 28న జరుగనుండగా ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్‌, వెల్‌స్పన్‌ కంపెనీ చైర్మన్‌ బీకే గొయెంకా పాల్గొనున్నారు.

 

ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి.. విజయవంతంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న వెల్‌స్పన్‌ గ్రూప్‌.. మరింత విస్తరిస్తుండడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. వెల్ స్పన్ గ్రూప్ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ కంపెనీ రాష్ట్రంలో రూ.350 కోట్ల పెట్టుబడిగా పెట్టబోతున్నందుకు కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన మౌలిక వసతుల కారణంగా పెట్టుబడులు తరలివస్తున్నాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు.. మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు.