Srisailam Power House Fire: విషాదం, ఒక్కరూ బతకలేదు, శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదంలో తొమ్మది మంది మృతి, అత్యంత దురదృష్టకరం అంటూ ప్రధాని ట్వీట్
శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాదంలో (Srisailam Power Plant Fire) లోపల చిక్కుకున్న తొమ్మిదిమందీ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు తెలంగాణ జెన్ కో అధికారులు ప్రకటించారు. ముందుగా మంటలు చెలరేగిన ప్రాంతం (Srisailam Power Plant Fire) నుంచి ఎన్‌డీఆర్ఎఫ్ సహాయక సిబ్బంది అయిదు మృతదేహాలను వెలుపలికి తీసుకువచ్చారు. తొలుత రెస్క్యూ బృందం మూడో ఫ్లోర్‌లో ఏఈ సుందర్ నాయక్ (35) మృతదేహాన్ని గుర్తించింది. ఆ తర్వాత మోహన్‌తో పాటు మరో అయిదుగురి మృతదేహాలను గుర్తించింది. చివరిగా మరో ముగ్గురు మృత దేహాలను గుర్తించింది.
Hyderabad, August 21: ఆశలు ఆవిరయ్యాయి. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాదంలో (Srisailam Power Plant Fire) లోపల చిక్కుకున్న తొమ్మిదిమందీ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు తెలంగాణ జెన్ కో అధికారులు ప్రకటించారు. ముందుగా మంటలు చెలరేగిన ప్రాంతం (Srisailam Power Plant Fire) నుంచి ఎన్‌డీఆర్ఎఫ్ సహాయక సిబ్బంది అయిదు మృతదేహాలను వెలుపలికి తీసుకువచ్చారు. తొలుత రెస్క్యూ బృందం మూడో ఫ్లోర్‌లో ఏఈ సుందర్ నాయక్ (35) మృతదేహాన్ని గుర్తించింది. ఆ తర్వాత మోహన్‌తో పాటు మరో అయిదుగురి మృతదేహాలను గుర్తించింది. చివరిగా మరో ముగ్గురు మృత దేహాలను గుర్తించింది.
జెన్‌కో అధికారుల వివరాల ప్రకారం... ‘రాత్రి 10.30 గంటలకు ప్యానెల్స్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం గుర్తించిన ఉద్యోగులు మంటలార్పేందుకు యత్నించారు. ప్రాణాలు లెక్క చేయకుండా ప్లాంట్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. రాత్రి 12 గంటల సమయంలో ఫోన్ చేసి ప్రమాదంపై సమాచారం అందించారు. ఆపదలో చిక్కుకున్నట్లు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు ప్లాంట్‌లో ఉన్నారు. 9 మంది దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. మరో 8 మంది సురక్షితంగా బయటకు వచ్చారు’ అని పేర్కొన్నారు.
విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని
తెలంగాణలోని శ్రీశైలం జలవిద్యుత్ ప్లాంట్‌లో జరిగిన విషాద అగ్ని ప్రమాదంలో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినందుకు బాధగాఉంది. నా ఆలోచనలు దు ఖించిన కుటుంబాలతో ఉన్నాయి. గాయపడినవారికి త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాన అంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు. అలాగే శ్రీశైలం విద్యుత్ కేంద్రం ( Srisailam power plant ) లో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. గాయపడి చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Tweet by President Ram Nath Kovind:
Here's PM Modi Tweet
Update by ANI
మృతుల వివరాలు
1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్
2.AE వెంకట్‌రావు, పాల్వంచ
3.AE మోహన్ కుమార్, హైదరాబాద్
4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్
5.AE సుందర్, సూర్యాపేట
6. జూనియర్ ప్లాంట్ ఆపరేటర్ రాంబాబు, ఖమ్మం జిల్లా
7. జూనియర్ ప్లాంట్ ఆపరేటర్ కిరణ్, పాల్వంచ
8. టెక్నీషియన్ మహేష్ కుమార్
9.హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి వినేష్ కుమార్
శ్రీశైలం పవర్‌హౌస్ ఘటనపై (Hydroelectric Power Plant Fire) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (TS CM KCR) సీఐడీ విచారణకు ఆదేశించారు. సీఐడీ అడిషనల్ డీజీ గోవింద్ సింగ్‌ను విచారణాధికారిగా నియమించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.