Srisailam Power Plant Fire Accident: కమ్మేసిన పొగ..పనిచేయని ఫోన్లు, ప్లాంట్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన రెస్కూ టీం, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైయస్ జగన్

శ్రీశైలం జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదంపై (Srisailam Power Plant Fire Accident) తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (TS CM KCR) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్లాంట్‌లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగిరావాలని సీఎం కోరుకున్నారు. ప్లాంట్ వద్ద ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావుతో మాట్లాడిన సీఎం కేసీఆర్ అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Srisailam Power Plant Fire Accident (photo-Video Grab)

Srisailam, August 21: శ్రీశైలం జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదంపై (Srisailam Power Plant Fire Accident) తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (TS CM KCR) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్లాంట్‌లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగిరావాలని సీఎం కోరుకున్నారు. ప్లాంట్ వద్ద ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావుతో మాట్లాడిన సీఎం కేసీఆర్ అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ప్లాంట్‌లో (Srisailam Power Plant) చిక్కుకున్న వారు క్షేమంగా బయటకు రావాలని ఆకాంక్షించారు. విద్యుత్ ప్రమాద ఘటనతో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేయగా మంత్రి జగదీష్ రెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షిస్తున్నారు.

శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు కాలువ జ‌ల విద్యుత్ కేంద్రంలో (Telangana Srisailam Power Plant) షాట్ స‌ర్క్యూట్ కార‌ణంగా గురువారం రాత్రి 10.30 గంట‌ల‌కు భారీ ప్ర‌మాదం చోటుచేసుకుంది. విద్యుత్ కేంద్రంలో ఒక్క‌సారిగా మంట‌లు ఎగ‌సిప‌డ‌టంతో ద‌ట్టంగా పొగ‌లు క‌మ్ముకున్నాయి. ప్ర‌మాద స‌మ‌యంలో 17 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. వారిలో 8 మంది సొరంగం నుంచి క్షేమంగా బయ‌ట‌ప‌డ్డారు. మిగిలిన తొమ్మిదిమంది సిబ్బంది విద్యుత్‌ కేంద్రంలోనే చిక్కుకుపోయారు. దీంతో అధికారులు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. వీరి ఫోన్లు గంటపాటు పని చేసినా తరువాత స్పందించకపోవడంతో సిబ్బంది కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

TS CMO Tweet

AP CMO Tweet

వీరిలో ఏడుగురు జెన్‌కో ఉద్యోగులు కాగా, ఇద్ద‌రు అమ్రాన్ కంపెనీకి చెందిన సిబ్బంది ఉన్నారు. డీఈ శ్రీనివాస్, ఏఈలు సుందర్, కుమార్, సుష్మా, ఫాతిమా, వెంకట్రావు, మోహన్‌తో పాటు ఆమ్రాన్‌ కంపెనీకి చెందిన రాంబాబు, కిరణ్ లోపలే ఉండిపోయారు. ఇప్పటికే బయటకు వచ్చిన 8 మందిలో ఇద్దరు క్షేమంగా ఉన్నారు. పొగ కారణంగా మరో ఆరుగురు అస్వస్థతకు గురి కావడంతో జెన్కో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు, ఫైర్ రెస్క్యూ సిబ్బంది యూనిట్ ను తమ ఆధీనంలోకి తీసుకొని రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఎన్డిఆర్ఎఫ్, సింగరేణి సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో నాలుగు టన్నెళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని పాతాళగంగలో ఉన్న ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది.

షార్ట్‌సర్య్యూట్ వలనే ప్రమాదం : జిల్లా కలెక్టర్

శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం (srisailam power station fire mishap) షార్ట్‌సర్య్యూట్ వలనే జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అండర్ గ్రౌండ్‌లో దట్టంగా పొగ అలుముకుందని దీంతో 9 మంది ఉండిపోయారని తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది లోపల చిక్కుకున్నవారిని కాపాడేందుకు వెళ్లి.. పొగ కారణంగా వెనక్కు వచ్చారని తెలిపారు. రాత్రి 10.30 గంటలకు మొదటి యూనిట్లో ఫైర్‌ జరిగిందని కలెక్టర్ చెప్పారు. జెన్ కో ఆసుపత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పారు.

Here's Fire Video

ఏపీ సీఎం జగన్‌ దిగ్భ్రాంతి:

తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌​ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎలాంటి సహకారం కావాలన్నా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీ విద్యుత్‌ శాఖ అధికారులు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్నారు. ఈ రోజు శ్రీశైలం పర్యటనను ఏపీ సీఎం రద్దు చేసుకున్నారు.

విచారం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ( Union Minister Kishan Reddy) విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. "నిన్న రాత్రి తెలంగాణ రాష్ట్రంలోని శ్రీశైలం ఎడమ గట్టున ఉన్న భూగర్భ జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బందితో మాట్లాడి వెంటనే సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను" అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రమాదం జరగడం దురదృష్టకరం : మంత్రి జగదీశ్‌ రెడ్డి

శ్రీశైలం లెఫ్ట్‌ పవర్‌ హౌస్‌లో ప్రమాదం జరగడం దురదృష్టకరమని మంత్రి జగదీశ్‌ రెడ్డి (TS Minister Jagadeesh Reddy) అన్నారు. లోపల దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు విఘాతం కలిగిందన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది లోపల చిక్కుకున్నవారిని కాపాడేందుకు.. మూడుసార్లు లోపలకు వెళ్లి.. పొగకారణంగా వెనక్కు వచ్చారని తెలిపారు. ఆక్సిజన్‌ పెట్టుకున్నా ఘటనాస్థలికి చేరలేకపోతున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి చెప్పారు. దీంతో సింగరేణి సిబ్బంది సాయం కోరామని, లోపలున్న వారిని కాపాడేందుకు..శాయశక్తులా కష్టపడుతున్నామన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now