SSC Exam Paper Leak: టెన్త్ పరీక్షలు వాయిదా వార్తలపై క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ, పరీక్షలు యథాతథంగా జరుగుతాయని వెల్లడి, లీక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు
సోమవారం ఉదయం 9 గంటలకు టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభం అవ్వగానే నిమిషాల వ్యవధిలో తెలుగు పేపర్ వాట్సాప్‌లో ప్రత్యక్షమై సంచలనం రేపిన సంగతి విదితమే.
Hyd, April 3: తాండూర్‌లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ (SSC Exam Paper Leak) వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాఫిక్ అంశంగా మారింది. సోమవారం ఉదయం 9 గంటలకు టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభం అవ్వగానే నిమిషాల వ్యవధిలో తెలుగు పేపర్ వాట్సాప్‌లో ప్రత్యక్షమై సంచలనం రేపిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో ప్రశ్నాపత్రం లీకైందంటూ వార్తలు వినిపించాయి. మిగతా పరీక్షలు వాయిదా పడ్డాయంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ఈ వార్తలపై పాఠశాల విద్యాశాఖ (school education department) డైరెక్టర్ దేవసేన క్లారిటీ ఇచ్చారు.
రేపటి పదో తరగతి పరీక్ష యథాతథంగా జరుగుతుందని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని (Clarity on Tenth exams postponed Rumors) తెలిపారు. టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ బహిర్గతం కావడంపై జిల్లా కలెక్టర్, వికారాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న నలుగురు వ్యక్తులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. చట్టం 25/1997, CrPC సంబంధిత సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.
‘సెంటర్ నెం. 24033, గవర్నమెంట్, హైస్కూల్ నెం.1, తాండూరు, వికారాబాద్ జిల్లాలోని ఇన్విజిలేటర్ బందెప్ప పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రశ్న పత్రాన్ని ఫోటో తీసి మరో ఉపాధ్యాయుడు సమ్మప్పకు ఉదయం 9.37 గంటలకు పంపినట్లు గుర్తించాం. పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం 9.30 తర్వాత బయటి వ్యక్తిని కేంద్రంలోకి రాలేదు. కేంద్రం నుంచి బయటకు ఎవరూ వెళ్లలేదు. పరీక్షా నిర్వహణ విషయంలో రాజీపడలేదు. విచారణ తర్వాత ఇది కేవలం ఇన్విజిలేటర్ బందెప్ప దుర్వినియోగమేనని నిర్ధారించానని తెలిపారు.
తెలంగాణలో నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. ఎగ్జామ్స్ రాయనున్న 4.94 లక్షల మంది విద్యార్థులు
సస్పెండ్ అయ్యింది వీళ్లే..
1. శివ కుమార్, GHM, ZPHS, ముద్దాయిపేట, యాలాల్(M) (చీఫ్ సూపరింటెండెంట్)2. K. గోపాల్, SA, Govt., No.1 ఉన్నత పాఠశాల, తాండూరు (డిపార్ట్‌మెంట్ అధికారి)3. S. బండప్ప, SA(BS), Govt., No. 1 ఉన్నత పాఠశాల, తాండూరు. (ఇన్విజిలేటర్)4. సమ్మప్ప, SA(PS), ZPHS, చెంగోలు, తాండూరు మండలం (ఇన్విజిలేటర్)