10th Class Paper Leak (photo-Twitter)

Hyd, April 3: తెలంగాణలో సోమవారం నుంచి టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, పరీక్ష ప్రారంభమైన కాసేపటికే పరీక్ష పేపర్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే(9 గంటల 37 నిమిషాలకు) తెలుగు పేపర్‌ తాండూరులో వాట్సాప్ సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. తాండూరులో ప్రశ్నాపత్రం సర్క్యూలేట్‌ అయ్యింది.

తెలంగాణలో నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. ఎగ్జామ్స్ రాయనున్న 4.94 లక్షల మంది విద్యార్థులు

ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న టెన్త్‌ పేపర్‌పై పోలీసులు, విద్యాశాఖ ఆరా తీసింది. పేపర్‌ ఎలా లీక్‌ అయ్యింది అని దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫోటో ఎవరు తీశారు అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రశ్నపత్రం చిత్రాలను ఇన్విజిలేటర్ తీశారని పోలీసులు స్పష్టం చేశారు. అతనిపై కేసు నమోదైంది. ప్రశ్నపత్రం లీక్ కాలేదని పోలీసులు కూడా ధృవీకరించారు.

తాండూర్‌లో తాండూర్‌లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్‌ వ్యవహారంపై తెలంగాణ సర్కార్‌ సీరియస్‌ అయ్యింది. సెల్‌ఫోన్‌ను లోపలికి అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎగ్జామ్‌ సెంటర్‌ సూపరింటెండెంట్‌ను తొలిగిస్తూ చర్యలు చేపట్టింది. క్వశ్చన్‌ పేపర్‌ లీకేజ్‌పై నివేదిక ఇవ్వాలని వికారాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది.

టెన్త్‌ పేపర్‌ బయటకు పంపిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అయితే పేపర్‌ ఎక్కడా లీక్‌ కాలేదని పోలీసులు చెబుతున్నారు. పరీక్ష మొదలైన తర్వాతే పేపర్‌ బయటకు వచ్చిందని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్‌ను మీడియా గ్రూప్‌లో పెట్టిన్నట్లు గుర్తించారు.

ఉదయం 9:30 గంటలకు పదో తరగతి పరీక్ష ప్రారంభమవ్వగా.. 9:37 గంటలకు పేపర్‌ను వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌చేశారని పోలీసులు తెలిపారు. ఎగ్జామ్‌ హాల్‌నుంచి పేపర్‌ పంపినందుకు ఇన్విజిలేటర్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.