Rain Alert: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షసూచన, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే ప్రభావం..

రాగల మూడ్రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.

Representational Image | (Photo Credits: PTI)

హైదరాబాద్ : మండుటెండలతో , తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ వాసులకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల మూడ్రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.

Rajasthan: దేశంలో మరో మిస్టరీ వ్యాధి కలకలం, ఐదు రోజుల్లో ఏడుగురు చిన్నారులు మృతి, జ్వరం, మూర్ఛ వంటి లక్షణాలతో మరణించినట్లు తెలిపిన రాజస్థాన్ అధికారులు

మధ్య చత్తీస్‌ఘడ్ నుండి తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావంతోనే అక్కడ వర్షాలు కురవనున్నాయి. వర్షం పడే సమయంలో గాలి వేగం గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని అధికారులు తెలిపారు.



సంబంధిత వార్తలు