Kavitha Bail Petition: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

BRS Leader K Kavitha (File Image)

Hyderabad, Aug 20: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (Delhi Liquor Scam) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఇటీవల బెయిల్ లభించడంతో.. కవితకు కూడా బెయిల్ రావొచ్చన్న వార్తలు వస్తున్నాయి. కోర్టు ఆదేశాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతుంది.

కలకత్తా వైద్యురాలి హత్యాచారం కేసులో కీలక పరిణామం, ప్రధాన నిందితుడికి పాలిగ్రాఫ్‌/లై డిటెక్టర్‌ టెస్ట్ చేయనున్న సీబీఐ, అనుమతించిన కలకత్తా హైకోర్టు

147 రోజులుగా తీహార్ జైల్లోనే..

లిక్కర్ కేసులో మార్చి 16న కవితను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ లో అరెస్ట్ చేసింది. కోర్టు ఆదేశాలతో నేరుగా ఢిల్లీలోని తీహార్ జైలుకు ఆమెను తరలించారు. కవిత తీహార్ జైల్లో ఉండగానే సీబీఐ రంగంలోకి దిగి ఆమెను అరెస్ట్ చేసింది. మార్చి 26 నుంచి అంటే గత 147 రోజులుగా కవిత తీహార్ జైల్లోనే ఉంటున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటన.. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif