TDP in Telangana Fray: తెలంగాణలో ఒంటరిగా బరిలోకి టీడీపీ.. త్వరలోనే అభ్యర్థుల పేర్ల ప్రకటన.. తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని, పొలిట్ బ్యూరో సభ్యుడు రావులతో చంద్రబాబు భేటీ
అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, మిగతా పార్టీలు కూడా అభ్యర్థుల కూర్పులో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు.
Hyderabad, Aug 22: తెలంగాణలో (Telangana) శాసనసభ ఎన్నికల (Assembly Elections) వేడి రాజుకున్నది. అధికార బీఆర్ఎస్ (BRS) ఇప్పటికే అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, మిగతా పార్టీలు కూడా అభ్యర్థుల కూర్పులో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ప్రకటించారు. త్వరలోనే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో నిన్న తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులతో సమావేశమయ్యారు.
బస్సు యాత్ర
తమ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నేతలకు సూచించారు. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాతే బస్సుయాత్రతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.