Graduate MLC By Poll: గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న విజ‌యం, నైతికంగా తానే గెలిచానంటున్న రాకేష్ రెడ్డి

బీఆర్ఎస్ అభ్యర్థి ఎలిమినేషన్ తో మల్లన్న విజయం సాధించాడు. రెండో ప్రాధాన్యత ఓట్లలో మల్లన్న, రాకేశ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే, రాకేశ్ ఎలిమినేషన్ తో మల్లన్నను విజయం వరించింది.

Teenmaar Mallanna (Photo-Twitter)

Nalgonda, June 07: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపొందాడు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎలిమినేషన్ తో మల్లన్న విజయం సాధించాడు. రెండో ప్రాధాన్యత ఓట్లలో మల్లన్న, రాకేశ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే, రాకేశ్ ఎలిమినేషన్ తో మల్లన్నను విజయం వరించింది. అయితే సాంకేతికంగా తాను ఓడిపోయినా నైతికంగా తనదే విజయం అని నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు మంత్రులు ఉన్నారని చెప్పారు. నల్గొండలోని ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కేంద్రం వద్ద శుక్రవారం రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Andhra Pradesh: ఓటమి తర్వాత నేతలతో జగన్ తొలి సమావేశం, పరాజయంపై కారణాలు విశ్లేషణ చేయనున్న వైసీపీ అధినేత 

ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా తాను గట్టి పోటీ ఇచ్చానని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. తన పోరాటం ప్రజలకోసమేనని, ఎల్లవేళలా ప్రజల మధ్యే ఉంటానని చెప్పారు. తనకు పార్టీలకు అతీతంగా చాలా మంది మద్దతు తెలిపారని, వారందరికీ ధన్యవాదాలు అని చెప్పారు. తనకు తెలిసింది పోరాటం మాత్రమేనన్నారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు తనకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించిందన్నారు. అందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఎన్నికల్లో యావత్ పార్టీ తనకు అండగా నిలిచిందని, తనకు ఓటేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.



సంబంధిత వార్తలు

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

Priyanka Gandhi: మీ కోసం పోరాడుతా..తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక గాంధీ..ప్రజల వ్యక్తిగా పనిచేస్తానని వెల్లడి

Priyanka Gandhi: ఆరంభం అదుర్స్‌..రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ, వయనాడ్‌లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపు..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు