Telangana: వేకువ జామునే కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు-కారు ఢీ, ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత, ఆస్పత్రిలో చావు బతుకుల్లో మరో చిన్నారి

ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న ఘటనలో ( 5 People Killed in Bus-Car Collision) ఐదుగురు మృత్యువాత పడ్డడారు. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌లో సోమవారం వేకువ జామునే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

Accident Representative image (Image: File Pic)

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న ఘటనలో ( 5 People Killed in Bus-Car Collision) ఐదుగురు మృత్యువాత పడ్డడారు. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌లో సోమవారం వేకువ జామునే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి ( Kamareddy) వైపు నుంచి కరీంనగర్ వెళ్తున్న కారును ఎదరుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు ముందరి టైరు పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు నంబర్ ఆధారంగా మృతులంతా నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లికి చెందినవారుగా భావిస్తున్నారు.

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు లోయలో పడి 8 మంది మృతి, 54 మందికి గాయాలు

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ప్రమాద ఘటన విషయాన్ని పరిశీలించారు. గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు .



సంబంధిత వార్తలు

Realme 14X 5G: రియల్ మి నుంచి తొలిసారిగా ఐపీ69 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌ స్మార్ట్‌ఫోన్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో రియల్‌మీ 14ఎక్స్‌ 5జీ వచ్చేసింది, ధర, పీచర్లు ఇవిగో..

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు