Telangana Shocker: శ్రీ చైతన్య కాలేజీలో ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య, సంచలన విషయాలు వెలుగులోకి, గతంలో లెక్చరర్ కొట్టడంతో 15 రోజులు ఆస్పత్రిలో ఉన్నాడని తల్లిదండ్రుల ఆరోపణలు

కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న సాత్విక్‌ అనే విద్యార్థి క్లాస్‌ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య ( satvik committed suicide) చేసుకున్నాడు. ఒత్తిడి వల్లే సాత్విక్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపించారు.

Satvik committed suicide (Photo-ANI)

Hyd, Mar 1: హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న సాత్విక్‌ అనే విద్యార్థి క్లాస్‌ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య ( satvik committed suicide) చేసుకున్నాడు. ఒత్తిడి వల్లే సాత్విక్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపించారు. సాత్విక్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గత రాత్రి స్టడీ అవర్ పూర్తి అయిన తర్వాత మిగిలిన విద్యార్థులు బయటకు రాగా.. సాత్విక్ క్లాస్‌రూంలోనే ఉండిపోయాడు. కొద్దిసేపటికి అక్కడే ఉన్న ఓ నైలాన్ తాడుతో సాత్విక్ ఆత్మహత్య (hanging himself) చేసుకున్నాడు.

అది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు కాలేజీ సిబ్బందిని సాయం కోరగా వాళ్లు పట్టించుకోలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించారు. దీంతో, తోటి విద్యార్థులు బయట వాహనం లిఫ్ట్‌ అడిగి ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్‌ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

రాజస్థాన్‌లో దారుణం, రోడ్డు మీద వెళుతున్న విద్యార్థినులను వదలని కామాంధులు, బలవంతంగా ముద్దులు పెడుతూ అత్యాచారయత్న ప్రయత్నం, వీడియో సోషల్ మీడియాలో వైరల్

అనంతరం, సాత్విక్‌ పోస్టుమార్టం కోసం సాత్విక్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సాత్విక్‌ ఘటనపై విద్యార్థి పేరెంట్స్‌ స్పందించారు. గతంలో లెక్చరర్స్‌ కొట్టడంతో 15 రోజులు ఆసుపత్రి పాలయ్యాడు. సాత్విక్‌ను ఏం అనొద్దని గతంలోనే చెప్పాం. మెంటల్‌ స్ట్రెస్‌కి గురిచేయడం వల్లే సాత్విక్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మా అబ్బాయి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సాత్విక్‌ మృతితో శ్రీచైతన్య కాలేజీ ఎదుట విద్యార్థి పేరెంట్స్‌, విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే సాత్విక్‌ మృతిచెందాడని ఆరోపించారు. చదువు కోసం పంపిస్తే చంపేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని సాత్విక్‌ సోదరుడు పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది దాడి చేసిన దృశ్యాలను విద్యార్థులు విడుదల చేశారు. ఫిర్యాదు చేసి విద్యార్థులను టార్గెట్‌ చేసి కొడుతున్నారని ఆరోపించారు.

మద్యం మత్తులో ట్రాఫిక్‌ ఎస్సైని కాలితో తన్నిన యువకుడు, నీకు సెక్షన్లు తెలుసా అంటూ వీరంగం, కేసు నమోదు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు

మరోవైపు నార్సింగిలోని కార్పొరేట్ కాలేజ్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాత్విక్ తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ సిబ్బంది తీరుపై సాత్విక్ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కాలేజీ సిబ్బంది తీరువల్లే సాత్విక్‌ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపించారు. సాత్విక్ తల్లిదండ్రుల ధర్నాకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. మరోవైపు కార్పొరేట్‌ కాలేజీ హాస్టల్‌ వార్డెన్‌ పరారీలో ఉన్నాడు.

ఇంటర్ విద్యార్థి సాత్విక్‌ (Inter Student Satvik) మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్పొరేట్ కాలేజీ (Corporate College) సిబ్బంది కృష్ణారెడ్డి, ఆచార్య, హాస్టల్ వార్డెన్ నరేష్ పేర్లను ఎఫ్‌ఐఆర్‌ (FIR)లో చేర్చారు. సాత్విక్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో సెక్షన్ 305 కింద కేసు నమోదు అయింది.