బంజారాహిల్స్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కారులో ప్రయాణిస్తున్న గౌరవ్ అనే యువకుడి బ్రీత్ అనలైజర్ టెస్టులో 94 పాయింట్లు నమోదు కావడంతో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో యువకుడు రెచ్చిపోయి తనకు హైకోర్టు జడ్జి తెలుసంటూ ట్రాఫిక్ ఎస్సైతో దుర్భాషలాడాడు. నీకు సెక్షన్లు తెలుసా? ఐపీసీ సెక్షన్ 123 కింద నీపై కేసు ఫైల్ చేస్తానంటూ హెచ్చరిస్తూ ఎసైను కాలితో తన్నాడు.
యువకుడి పక్కన ఉన్న యువతి సైతం రెచ్చిపోయి ప్రవర్తించింది. వీడియోలు తీస్తారా? మీకు సిగ్గు లేదా? అంటూ మాట్లాడింది. దీంతో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులపై హద్దుమీరి ప్రవర్తించిన యువకుడిని ఆహా ఓటీటీలో పనిచేస్తున్న గౌరవ్‌గా గుర్తించారు.
Here's Video
బంజారాహిల్స్ లో మద్యం మత్తులో యువకుడి వీరంగం | Drunk and drive case at Banjarahills| hmtvhttps://t.co/sS4AsNm1gt#hmtvnews #hmtv
— hmtv News (@hmtvnewslive) February 28, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)