Gussadi Kankaraju Died: గుస్సాడీ క‌ళాకారుడు క‌న‌క‌రాజు క‌న్నుమూత‌, ఆదివాసీల నృత్యానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన గొప్ప క‌ళాక‌రుడు, రేపు స్వ‌గ్రామంలో అంత్య‌క్రియ‌లు

ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన ఆయన 70 ఏండ్ల వయసులో అనారోగ్యంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. రేపు మర్లవాయిలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు

Gussadi Kankaraju Died

Asifabad, OCT 25: తెలంగాణ కళాకారుడు, గుస్సాడీ నృత్యానికి వన్నె తెచ్చిన కనకరాజు (Kanakaraju) కన్నుమూశారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన ఆయన 70 ఏండ్ల వయసులో అనారోగ్యంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. రేపు మర్లవాయిలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి 2021 లో కనగరాజుకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రదానం చేసింది.

Telangana Arstist Gussadi Kankaraju Died

 

అసిఫాబాద్‌లోని ఆదివాసీ బిడ్డల నృత్య రూపకమైన గుస్సాడీకి కనకరాజు ఎనలేని కీర్తిని తెచ్చారు. తమ అస్తిత్వ కళారూపాన్ని ఆయన తరచూ ప్రదర్శిస్తూ భావి తరాలకు తమ ఆచార, సంప్రదాయాలను తెలియజేశారు. దాంతో, ఆయన పేరు గుస్సాడీ కనకరాజుగా స్థిరపడిపోయింది. ఆదివాసీల కళను బతికిస్తూ.. అందులోనే ఆనందాన్ని వెతుక్కున్న ఆయన పేరును అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు సిఫారసు చేసింది. 2021 నవంబర్ 9వ తేదీన అప్పటి రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ చేతుల మీదుగా ఆయన దేశపు నాలుగో అత్యున్నత అవార్డు అయిన పద్మశ్రీని అందుకున్నారు.