IPL Auction 2025 Live

Telangana Budget Session 2022: మరి కొద్ది సేపట్లో అసెంబ్లీకి తెలంగాణ వార్షిక బడ్జెట్, మూడోసారి ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హరీశ్ రావు, నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

మ‌రికాసేప‌ట్లో ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు.

TS Assembly Monsoon Session 2020 (Photo-Telangana CMO Twitter)

Hyd, Mar 7: రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం (Telangana Budget Session 2022) కానున్నాయి. మ‌రికాసేప‌ట్లో ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమై బడ్జెట్‌కు (Telangana Budget ) ఆమోదం తెలిపిన సంగ‌తి తెలిసిందే. శాఖలవారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏకగ్రీంగా ఆమోదించింది.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అనంత‌రం జ‌రిగే బీఏసీ స‌మావేశమౌతుంది. అసెంబ్లీని ఎన్నిరోజుల పాటు నిర్వహించాలనేది ఖరారు చేస్తుంది. రెండు వారాల పాటు తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. బడ్జెట్ అవుట్ లే 2,50,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ హరిచందన్‌, అనంతరం సభ వాయిదా

తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మూడోసారి ఆర్థిక మంత్రి హోదాలో ఆర్థికమంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే నేరుగా కోకాపేట నివాసం జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆల‌య అర్చ‌కులు మంత్రిని ఆశీర్వ‌దించి తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. హ‌రీశ్‌రావుతో పాటు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కూడా పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అక్క‌డ్నుంచి నేరుగా హ‌రీశ్‌రావు అసెంబ్లీకి బ‌యల్దేర‌నున్నారు. కోకాపేట్‌లోని త‌న నివాసం వ‌ద్ద హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశీస్సుల‌తో మూడోసారి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్నాన‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు ప్ర‌తిబింబించేలా బ‌డ్జెట్ ఉంటుంది. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేరేలా బ‌డ్జెట్ ఉంటుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.



సంబంధిత వార్తలు

Ambati Rambabu: అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయరా ? పోలీసులకు సూటి ప్రశ్న విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఉభయసభలు వాయిదా, మణిపూర్ హింస, అదానీ గ్రూప్‌పై లంచం ఆరోపణలపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్

Parliament Winter Session Starting Today: నేటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు.. డిసెంబర్‌ 20 వరకు కొనసాగే అవకాశం.. వక్ఫ్‌ సహా 16 బిల్లులపై చర్చ.. అదానీ, మణిపూర్‌ అంశాలపై ఉభయసభల్లో వాడీవేడీ యుద్ధం

Rains in AP: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఎల్లుండి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి.. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారుల హెచ్చరికలు