Telangana Election Results 2023: అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టనున్న ఎమ్మెల్యేలు వీళ్లే, ఎర్రబెల్లి దయాకర్‌రావుపై 8 వేల ఓట్ల మెజారిటీతో యశస్వినిరెడ్డి ఘన విజయం

గతంలో పోటీచేసి ఓడిపోయిన వాళ్లు, ఈ ఎన్నికల్లోనే తొలిసారి పోటీచేసిన వాళ్లలో కొందరిని ప్రజలు దీవించారు.

Telangana-Exit-Poll-Results-2023

Assembly Election 2023 Results Live News Updates: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.ఈ ఎన్నికల ద్వారా వివిధ పార్టీల నుంచి తొలిసారిగా పలువురు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. గతంలో పోటీచేసి ఓడిపోయిన వాళ్లు, ఈ ఎన్నికల్లోనే తొలిసారి పోటీచేసిన వాళ్లలో కొందరిని ప్రజలు దీవించారు. వీరిలో అతి చిన్న వయసు వాళ్లు కూడా ఉండటం విశేషం. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం ఫస్ట్ టైమ్‌ ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో పాలకుర్తిలో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన యశస్వినిరెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై 8 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

మెదక్‌ నుంచి పోటీచేసిన మైనంపల్లి రోహిత్‌రావు ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డిపై గెలుపొందారు. వేములవాడలో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన ఆదిశ్రీనివాస్‌ విజయం సాధించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాగూర్‌ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కొడంగల్‌లో 32,800 ఓట్ల మెజార్టీతో రేవంత్ రెడ్డి ఘన విజయం, దుబ్బాకలో రఘునందన్ రావు ఓటమి, ఇప్పటివరకు గెలిచిన అభ్యర్థులు వీరే..

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి నుంచి పోటీచేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కలకుంట్ల మదన్‌మోహన్‌రావు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నుంచి ముందుల శామ్యూల్‌ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం అందుకున్నారు.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ప్రజలకు అందుబాటులో ఉండండి..పాత, కొత్త నాయకులు అంతా కలిసి పనిచేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్ త్వరలో వెల్లడిస్తానన్న ముఖ్యమంత్రి

Yashasvi Jaiswal Out Video: వివాదాస్పదంగా మారిన య‌శ‌స్వి జైస్వాల్ ఔట్, థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పు బట్టిన మాజీ క్రికెట‌ర్ గ‌వాస్క‌ర్‌, వీడియో ఇదిగో..

Ind vs Aus 4th Test: రెండో ఇన్నింగ్స్‌లో 1 ప‌రుగుకే వెనుదిరిగిన నితీష్ రెడ్డి, బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియాపై 184 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం

Telangana Assembly Session 2024: తెలంగాణలో మన్మోహన్‌ సింగ్ విగ్రహం ఏర్పాటు, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్