Telangana Assembly Elections 2023: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా, ఈ నెల 27న రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే

ఈ నెల 27న రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. కాంగ్రెస్‌ తరపున మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలోకి దిగనున్నట్లు సమాచారం.

Komatireddy Raj Gopal Reddy

బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ నెల 27న రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. కాంగ్రెస్‌ తరపున మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలోకి దిగనున్నట్లు సమాచారం.

అవినీతి పాలనకు చెక్‌ పెట్టే శక్తి బీజేపీకి ఉందని 15 నెలల క్రితం పార్టీలోకి చేరా.. మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌కి రాజీనామా చేసి బీజేపీలో చేరా.. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగలేదు.. ఆ స్థానంలోకి కాంగ్రెస్‌ వచ్చింది. తప్పనిసరి పరిస్థితిలోనే బీజేపీకి రాజీనామా చేశాను. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారినా నా లక్ష్యం ఒక్కటే.. అదే కేసీఆర్‌ పాలన అంతం’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

బీజేపీని ప్రాణంలా కాపాడుకుంటే నమ్మించి గొం కోసేశారు, ఏడ్చేసిన బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, పార్టీకి రాజీనామా

గతంలో మనుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నా అంత యాక్టివ్‌గా లేరు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో తిరిగి ఆయన కాంగ్రెస్‌లోకి చేరనున్నారు.