Ponnala Lakshmaiah Resigns: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్, రాజీనామా చేసిన సీనియర్ నేత పొన్నాల లక్షయ్య , సొంత పార్టీలోనే పరాయి వ్యక్తులమయ్యామని ఆవేదన

కాంగ్రెస్ కు ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన అన్నారు

ponnala laxmaiah (photo-Video Grab)

Hyd, Oct 13: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్షయ్య బిగ్ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. పార్టీ అంశాలు చర్చించేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు.

కొందరు నాయకుల వైఖరితో పార్టీ పరువు పోతోందని చెప్పారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పదేళ్లలో తనకు ఒక్క పదవి కూడా ఇ్వలేదని చెప్పారు. సర్వేల పేరుతో బీసీలకు సీట్లు ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా కనిపిస్తే నమస్తే పెట్టినా స్పందించరని అన్నారు. సొంత పార్టీలోనే పరాయి వ్యక్తులమయ్యామని చెప్పారు.

ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం, తెలంగాణలో 20 మంది అధికారులపై వేటు, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని ఆదేశాలు

కాగా జనగామ టికెట్ ను పొన్నాలకు కాకుండా కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై పొన్నాల చాలా అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు గత ఎన్నికల సమయంలో కూడా పొన్నాలకు చివరి నిమిషంలో టికెట్ దక్కింది. పొత్తులో భాగంగా కోదండరామ్ కు జనగామ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. అయితే పార్టీ నాయకత్వంతో మాట్లాడి చివరకు ఆయన టికెట్ దక్కించుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో పొన్నాల ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పని చేసిన పొన్నాల... తెలంగాణ రాష్ట్ర తొలి పీసీసీ చీఫ్ గా కూడా బాధ్యతలను నిర్వర్తించారు.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

KTR On Rythu Bharosa: రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్

Raigad Road Accident: రాయ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పి బోల్తా పడిన పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు, 5 మంది మృతి, 27 మందికి గాయాలు