Telangana Elections 2023: రెండు రోజలు పాటు తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు, కారణం ఏంటంటే..
ఈ నెల 30 న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో 30, వ తేదీ.. ఆ ముందు రోజు అనగా 29 వ రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలియజేసారు.
Hyd, Nov 15: తెలంగాణలో పాఠశాలలకు వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 30 న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో 30, వ తేదీ.. ఆ ముందు రోజు అనగా 29 వ రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలియజేసారు.
తెలంగాణలో మొత్తం 1.06 లక్షల మంది ఉపాద్యాయులు ఉండగా.. వారిలో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా పోలింగ్ ఉన్న ప్రభుత్వ పాఠశాల సిబ్బందికి ముందు రోజు మధ్యాహ్నం నుంచే అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల విధులు.. పోలీసు నిర్వహణకు వీలుగా ఉండేటట్లు రెండు రోజులు సెలవులు ఇవ్వాలని.. నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ నెల 29 వ తేదీ ఉదయం 7 గంటల లోపే ఈవీఎలను తీసుకోవడానికి ఉపాధ్యాయులు రిపోర్టు చేయాల్సి ఉంటుందని.. అందువల్ల ఈ నెల 29,30 వ తేదీల్లో స్కూళ్లకు సెలవు ఇవ్వాలని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నారు. ఈ సెలవుల విషయాన్ని ఎన్నికల సంఘం సూచన మేరకు అధికారికంగా ప్రకటన చేస్తానన్నారు. పోలింగ్ మొత్తం పూర్తయ్యేవరకు అర్ధరాత్రి దాటుతుంది. పోలింగ్ విధుల్లో పాల్గొన్న వారికి డిసెంబర్ 1 న కూడా సెలవు ఇవ్వాలని విద్యాశాఖ వర్గాలు అనుకుంటున్నారు.
వీడియో ఇదిగో, నేను ఈడ గెలిస్తే ఏపీలో చంద్రబాబు గెలిచినట్లే, తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. కాబట్టి దానికోసం అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులకు ప్రదానమైన విదులను కేటాయిస్తున్నారు. వాళ్లకి శిక్షణ కూడా కొనసాగుతుంది. చివరగా ఈ నెల 28 వతేదీన ప్రచార పర్వం ముగియనుంది. ఆ తర్వాత ఓకరోజు విరామం.. మరుసటి రోజు 30 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
పోలింగ్ కేంద్రాల్లో ఉండే సిబ్బందికి, శాంతి భద్రతల ఏర్పాట్ల గురించి ఇప్పటికే సమావేశాలు పూర్తయ్యాయి. ప్రత్యేకమైన అధికారులను ఏర్పాటు చేసారు. పూర్తిగా భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు అదికారులు వెల్లడించారు. తిరిగి మళ్లీ డిసెంబర్ 3 వతేదీన ఓట్ల కౌటింగ్ జరగనుంది. ఈ క్రమంలో పోలీంగ్ జరిగే రెండు రోజులు ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.