Congress Bus Yatra: కాంగ్రెస్ కార్యకర్తలే మా పులులు, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపిన రాహుల్ గాంధీ, కేసీఆర్ అబద్దాల కోరు, మోదీ మోసగాడు అంటూ విమర్శలు
కేసీఆర్ ప్రభుత్వం ఎంత అవినీతి చేసిన విచారణ జరగలేదని అన్నారు. కులగణన చేయడానికి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఇకపై మీ ప్రభుత్వం ఉండదని.. ప్రజా ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. కేసీఆర్ అబద్దాల కోరు, మోదీ మోసగాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Peddapalli, Oct 19: బీఆర్‌ఎస్ బీజేపీతో కుమ్మక్కైందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ను, కేంద్రంలో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి కాంగ్రెస్ సభలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంత అవినీతి చేసిన విచారణ జరగలేదని అన్నారు. కులగణన చేయడానికి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఇకపై మీ ప్రభుత్వం ఉండదని.. ప్రజా ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. కేసీఆర్ అబద్దాల కోరు, మోదీ మోసగాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ 2004లో హామీ ఇచ్చిందని రాహుల్ పేర్కొన్నారు. రాజకీయ నష్టం జరిగినా సోనియా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 10 ఏళ్ల తర్వాత కూడా సోనియా కల, తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ నెరవేర్చలేదని మండిపడ్డారు. సీఎం కుటుంబ సభ్యులే ప్రభుత్వంలోని ముఖ్యశాఖలను కంట్రోల్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పెళ్లి చేసుకుంటే రూ.లక్ష నగదు, తులం బంగారం, ములుగు వేదికగా హామీల వర్షం
కొన్ని రోజుల క్రితం పార్లమెంట్‌లో కులగణన గురించి మాట్లాడినట్లు రాహుల్ తెలిపారు. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారని, తన ఇల్లు కూడా లాక్కున్నారని ప్రస్తావించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని భరోసా ఇచ్చారు. తాము అబద్ధాలు చెప్పామని, ఆరు గ్యారెంటీలను మొదటి కేబినెట్‌లోనే ఆమోదిస్తామని అన్నారు. రైతు భరోసా ద్వారా ఎకరాకు 15 వేలు ఇస్తామని, సింగరేణి గనులను ప్రవేటే పరం కానివ్వమని హామీ ఇచ్చారు.
‘కర్ణాటక.. రాజస్థాన్‌లో అమలు చేశాం. తెలంగాణలోనూ మేము చెప్పిన హామీలు అమలు చేస్తాం. తెలంగాణ మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తారు. వంట గ్యాస్ రూ. 500కే ఇస్తాం. రైతులకు, రైతు కూలీలకు ఇచ్చిన హామీలు కూడా చేస్తాం. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు సింహాల్లాంటివారు. కేసీఆర్ సీఎంలా కాదు రాజులా వ్యవహరిస్తున్నారు.
రైతు బంధుతో భూస్వాములకే లాభం. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎంతమందికి వచ్చాయి?. కాళేశ్వరంలో అనినీతికి పాల్పడి లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారు. కాళేశ్వరంతో మీకు లాభం చేకూరిందా?. కేవలం కాంట్రాక్టర్లకే లాభం చేకూరింది. ధరణి పోర్టల్‌తో మీకు లాభం చేకూరిందా?. ధరణిలో భూముల రికార్డు మార్చారు. పేదల భూములు లాక్కున్నారు. కేసీఆర్ మూడెకరాలు దళితులకు ఇస్తాం అన్నారు ఇవ్వలేదు. మోదీ 15 లక్షలు మీ అకౌంట్‌లో వేస్తా అన్నారు ఇవ్వలేదు.
దేశ బడ్జెట్ రూ. 44 లక్షల కోట్లు. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్లాలన్నది 90 మంది కార్యదర్శులు నిర్ణయిస్తారు. 90 మంది కార్యదర్శులల్లో ముగ్గురు మాత్రమే ఓబీసీ వారు ఉన్నారు. తెలంగాణకు వస్తే ఎంతో సంతోషంగా ఉంది. తెలంగాణతో నాకున్న సంబంధం రాజకీయపరమైనది కాదు. మీ అందరితో నాకు ప్రేమ, కుటుంబ అనుబంధం ఉంది.
ఇప్పుడు దొరల తెలంగాణ -ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం జరుగుతోంది. కీలక శాఖలన్నీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది. ఇక్కడి భూములు ముంచి, ఇక్కడి భూములను లాక్కున్నారు. అయినా ఇక్కడి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ముఖ్యమంత్రికి, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే లాభం కలిగింది. ధరణి పోర్టల్ తో పేదల భూములను సీఎం లాకున్నారు. భూముల రికార్డులు మార్చేసి ప్రజలను మోసం చేస్తున్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, రుణ మాఫీ అమలు కాలేదు. పెద్ద పెద్ద రైతులకే రైతు బంధు లాభం జరిగింది. తెలంగాణకు వస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు తెలంగాణతో ఉన్న సంబంధం... రాజకీయ సంబంధం కాదు. కుటుంబంతో ఉన్న అనుబంధం నాది. 2004లోనే తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ప్రకటన చేసింది. ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటుకు సోనియా నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి గనులను ప్రైవేటు పరం కానివ్వం. ఇక్కడి గనులను అదానికి అమ్మే ప్రయత్నాన్ని మేమే అడ్డుకున్నాం.
దేశవ్యాప్తంగా అన్ని వనరులను అదానికే మోడీ అప్పగిస్తున్నారు. కార్మికులు, రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. దళితులకు మూడేకరాలని కేసీఆర్, 15 లక్షలు ఖాతాల్లో వేస్తామని మోదీ మోసం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదు. కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. కర్ణాటకలో మీరు ఎవరినైనా అడిగి తెలుసు కోండి." అని రాహుల్ గాంధీ అన్నారు.
తెలంగాణలోనూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం. ఎన్నికల తర్వాత మొదటి కేబినెట్ మీటింగ్ లోనే వీటిని అమలు చేస్తాం. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే అమలు చేస్తాం. కేసీఆర్ ఇక మీ ప్రభుత్వం ఉండదు. ప్రజల ప్రభుత్వం రాబోతోంది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే. ఈ మూడు పార్టీలు కలిసి పని చేస్తున్నాయి. బీజేపీకి ఓటు వేసినా, ఎంఐఎంకు వేసినా బీఆర్ఎస్ కు వేసినట్టే.
నేను బీజేపీపై పోరాటం చేస్తున్నాను. నాపై 26 కేసులు పెట్టారు. లోక్‌సభ సభ్యత్వం రద్దు చేశారు. ఢిల్లీలో ఇంటిని లాక్కున్నారు. సభలో మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు. అవినీతి కేసీఆర్‌పై మాత్రం ఎలాంటి కేసులు ఉండవు. అన్ని విషయాల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దత్తు ఇచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్‌ను, ఢిల్లీలో బీజేపీని ఓడించాలి. కాంగ్రెస్ తుఫాన్ రాబోతుంది. కాంగ్రెస్ కార్యకర్తలే మా పులులు. ఎవరికి భయపడొద్దు, రాబోయేది తెలంగాణ ప్రజల ప్రభుత్వం. కాంగ్రెస్ సర్కారులో కార్యకర్తల భాగస్వామ్యం ఉంటుంది."అని రాహుల్ గాంధీ అన్నారు.
బీజేపీతో పోరాడుతున్నానని నా డీఎన్‌ఏ నిరంతరం గుర్తు చేస్తోంది. బీజేపీకు మద్దతు ఇచ్చే వారు నాపై విమర్శలు గుప్పిస్తుంటే నా పోరాటం సవ్యంగా సాగుతోందని అర్థం అవుతోంది. అది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రజల పాలన ఏర్పడటం ఖాయం. పార్లమెంట్‌లో ఓబీసీ జనాభా ఎంత అని నిలదీశా. దేశాన్ని 90 మంది అధికారులు పరిపాలిస్తున్నారు. అందులో ఓబీసీలు కేవలం ముగ్గురే. అందుకే దేశానికి ఎక్స్‌రే అవసరమని చెబుతున్నా. డాక్టర్ దగ్గరకు వెళ్లగానే ఏ రోగమో తెలియాలంటే ఎక్స్‌రే తీసుకు రమ్మంటారు. మా ప్రభుత్వం రాగానే ముందుగా ఎక్స్‌రే (కులగణన) తీయించే పని చేస్తాం’’ అని రాహుల్ అన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)