Telangana Assembly Session 2023: తెలంగాణ విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది, విద్యుత్‌ శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు.

Deputy CM Bhatti Vikramarka (photo-Video Grab)

Hyd, Dec 21: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session 2023) ఆరో రోజు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఏ రంగం అభివృద్ధి చెందాలన్న విద్యుత్ అవసరమని.. అలాంటి విద్యుత్ ఉత్పత్తి, దీంట్లో ఇబ్బందులపై రాష్ట్ర ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియాలనే ఆలోచనతో శ్వేత పత్రాన్ని ప్రవేశపెడుతున్నట్లు డిప్యూటీ సీఎం ( Deputy CM bhatti-vikramarka) తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి జెన్‌కోలో విద్యుత్ సామర్థ్యం 4,365.26 మెగావాట్లుగా ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటు కన్నా చాలా ముందుగానే.. ఆనాటి నాయకుల ముందు చూపుతో తెలంగాణలో 2,960 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలకు అవసరమైన ప్రణాళిక పనులు చేపట్టారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పతి ప్రారంభించిన కొత్త విద్యుత్ కేంద్రాలే తర్వాత కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాయన్నారు.

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి అదనంగా 18 వందల మెగావాట్ల విద్యుత్ వచ్చే విధంగా యూపీయే ప్రభుత్వం సోనియాగాంధీ నాయత్వంలో ప్రత్యేక నిబంధన చట్టంలో రూపొందించడం జరిగిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

విద్యుత్ ప్రాజెక్టులపై జ్యుడిషియల్ విచారణకు సిద్ధం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, విద్యుత్ బకాయిలపై హాట్ హాట్‌గా సాగిన సమావేశాలు

తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టి పూర్తి చేసింది కేవలం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ మాత్రమేనని ఈ ప్రాజెక్టులో ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించటం వల్ల పెట్టుబడి వ్యయం భారీగా పెరిగిందని భట్టి విక్రమార్క అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వ్యయంలో కేవలం బొగ్గు సరఫరాకు ఏడాదికి 800 కోట్లు అదనంగా అవుతుందని, రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, డిస్కంలు రూ. 81 వేల 516 కోట్ల నష్టాల్లో ఉన్నాయని, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు రూ. 28,673 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు.

దళితబంధుకు బ్రేకులు? ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమ శాఖ లేఖ.. విధానపరమైన స్పష్టత వచ్చే వరకూ పథకాన్ని నిలిపివేసిన ఎస్సీ సంక్షేమ శాఖ

ప్రభుత్వంలోని వివిధ శాఖలు రూ. 28,842 కోట్ల బకాయిలను డిస్కంలకు చెల్లించాల్సి ఉందని, రూ. 14,193 కోట్లు సాగునీటి శాఖ బకాయి ఉందన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో ఇబ్బందులకు ఈ బకాయిలే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రూ. 14,928 కోట్ల సర్దుబాటు ఖర్చులు చెల్లించకపోవటం డిస్కంల ఆర్థిక పరిస్థితిని కుంగ దీసిందని, దీంతో రోజువారి విద్యుత్ మనుగడకు భారీగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

విద్యుత్‌ నాణ్యత పెంచాం: జగదీశ్‌రెడ్డి

చర్చలో భాగంగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. 2014 జూన్‌ 2నాటికి నాలుగు విద్యుత్‌ సంస్థల ఆస్తులు రూ.44.434 కోట్లు కాగా, రూ.22,423 కోట్ల్ల మేర అప్పులు ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం విద్యుత్‌ రంగ ఆస్తులు రూ.1,37, 570 కోట్లు కాగా, అప్పులు రూ.81,516 కోట్లు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్‌ సరఫరా నాణ్యతను పెంచామన్న ఆయన.. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ అందించామని చెప్పారు.



సంబంధిత వార్తలు

MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif