CM Revanth Reddy (PIC@ X)

Hyd, Dec 21: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. గురువారం అసెంబ్లీలో విద్యుత్ పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో లఘు చర్చ జరుగగా.. విద్యుత్‌పై మూడు అంశాలపై విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..

ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నాయకులు ఎదురుదాడి చేసినం అని అనుకుంటున్నారని.. తొమ్మిదిన్నర ఏళ్లలో వాస్తవాలను సభ ముందు గత ప్రభుత్వం పెట్టలేదన్నారు. విద్యుత్ శాఖను స్కాన్ చేసి వాస్తవాలను సభ ముందు పెడుతున్నామని తెలిపారు. విద్యుత్‌పై జ్యుడిషియల్ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. గత పాలకులు వాస్తవాలను హుందాగా ఒప్పుకోవాలన్నారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని తెలిపారు. విద్యుత్ శాఖలో మూడు అంశాలపై జ్యూడిషియల్ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

దళితబంధుకు బ్రేకులు? ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమ శాఖ లేఖ.. విధానపరమైన స్పష్టత వచ్చే వరకూ పథకాన్ని నిలిపివేసిన ఎస్సీ సంక్షేమ శాఖ

ఛత్తీస్‌ఘడ్ ఒప్పందాన్ని టెండర్లు లేకుండా ఒప్పందం చేసుకున్నారని.. ఛత్తీస్‌ఘడ్ ఒప్పందంపై ఆనాడే తాము పోరాటం చేస్తే మార్షల్‌తో సభ నుంచి బయటకు పంపారన్నారు. ఛత్తీస్‌గడ్ ఒప్పందంపై ఓ అధికారి నిజాలు చెప్తే ఆ ఉద్యోగికి డిమోషన్ ఇచ్చి మారుమూల ప్రాంతాలకు పంపారన్నారు. ఛత్తీస్‌ఘడ్ 1000 మెగావాట్ల ఒప్పందం చేసుకున్నారన్నారు. రూ.1362 కోట్ల భారం ఈ ఒప్పందం వల్ల ప్రభుత్వంపై భారం పడిందని తెలిపారు. ఛత్తీస్‌ఘడ్ ఒప్పందాలపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తామని సీఎం తెలిపారు.

యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కాలం చెల్లిన సంస్థతో ఒప్పందం చేసుకున్నారన్నారు. ఇండియా బుల్స్ కంపెనీకి న్యాయం జరిగిందని... ప్రభుత్వానికి భారం పడిందని తెలిపారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీకి కాలం చెల్లినా దాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి నష్టం చేశారన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. భద్రాద్రి, యాదద్రి పవర్ ప్రాజెక్టు పై జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేస్తామన్నారు. ఛత్తీస్‌ఘడ్ ఒప్పందాలు భద్రాద్రి, యాదాద్రి పవర్ పాయింట్లపై అవినీతి జరిగిందని.. ఆ అవినీతిపై జ్యుడీషియల్ విచారణ చేస్తామన్నారు.

భద్రాద్రి కాలం చెల్లిపోయిందని.. యాదాద్రి నుంచి ఒక్క మెగావాట్ల పవర్ ఉత్పత్తి చెయ్యలేదన్నారు. 24 గంటల కరెంట్‌పై అఖిల పక్షంతో నిజనిర్ధారణ కమిటీ వేద్దామన్నారుు. జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేయాలని మాజీ మంత్రి కోరిన కోరిక మేరకు విచారణ చేయాలని తాను ఆదేశాలిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

విద్యుత్‌ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట మొదటి స్థానంలో ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో గజ్వేల్‌, హైదరాబాద్‌ సౌత్‌ ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ‘‘సిద్దిపేట, గజ్వేల్‌, హైదరాబాద్‌ సౌత్‌ నుంచి ఎన్నికైన వారే గత తొమ్మిదేళ్లు తెలంగాణను పాలించారు. బీఆర్ఎస్, ఎంఐఎం వేరు కాదు.. ఇద్దరూ కలిసే పాలించారు.

బకాయిలు చెల్లించని ప్రాంతాల్లో మొదటి స్థానంలో సిద్దిపేట 61.37%. రెండో స్థానంలో గజ్వేల్ 50.29%, మూడో స్థానంలో హైదరాబాద్ సౌత్ 43 శాతం ఉన్నాయి. సిద్దిపేటలో ఎమ్మెల్మే హరీశ్‌రావు.. గజ్వేల్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. హైదరాబాద్ సౌత్‌లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ బకాయిలు చెల్లించే బాధ్యత తీసుకోవాలి. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో విద్యుత్ కోతలే లేవన్నట్లు జగదీష్‌రెడ్డి మాట్లాడారు. రైతులు రోడ్డెక్కారా అని జగదీష్‌రెడ్డి అడిగారు. కామారెడ్డిలో సెప్టెంబర్1వ తేదీన సబ్ స్టేషన్లు ముట్టడి చేసి రైతులు నిరసన తెలిపిన సంగతి జగదీష్‌రెడ్డికి గుర్తుచేస్తున్నాను’’ అని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.