KTR Vs Revanth Reddy: కేటీఆర్ - రేవంత్ మధ్య మాటల యుద్ధం, తాతలు-తండ్రుల పేర్లతో రాలేదన్న రేవంత్, కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

రెండో రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి - మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే చర్చ సందర్భంగా కేటీఆర్ - రేవంత్ పరస్పరం దూషించుకున్నారు.

ktr vs revanth reddy(Video grab)

Hyd, July 24: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. రెండో రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి - మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే చర్చ సందర్భంగా కేటీఆర్ - రేవంత్ పరస్పరం దూషించుకున్నారు.

తండ్రులు, తాతలు పేర్లు చెప్పుకొని రాలేదని కేటీఆర్‌కు చురకలు అంటించారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటా అనుకున్న కానీ అబ్సెంట్ ల్యాండ్ లార్డ్ అని తెలిసిందని, మొన్న ఢిల్లీకి వెళ్లి రహస్యంగా మాట్లాడుకున్నదే మీ అభిప్రాయమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ - బీజేపీ చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు.

మా నాన్న నాకు చదువు లేకపోయినా మంత్రి పదవి ఇవ్వలేదు, మేము స్వయం కృషితో పైకి వచ్చాం అని చెప్పారు. జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా,ఎంపీగా, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాని చెప్పారు. ఇక దీనికి కేటీఆర్ సైతం స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చారు. ఇక్కడున్న నాయకుడి స్థాయికి మేము చాలని, మీ స్థాయి ఏంటో మాకు తెలుసు అన్నారు. సభకు కేసీఆర్ రానవసరం లేదన్నారు. సీఎంకు ఓపిక ఉండాలని, పేమెంట్ కోటాలో రాలేదని నేను కూడా అనొచ్చు అని రేవంత్‌కు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. సీఎం వ్యాఖ్యలు రాజీవ్ గాంధీని అంటున్నారా? రాహుల్ గాంధీని అంటున్నారా? చెప్పాలన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకోవడంతో వీరిద్దరి మధ్య గొడవ సద్దుమణిగింది. రెండో రోజు సభకు రాని కేసీఆర్, ఆర్టీసీపై సభలో రగడ, హరీష్‌ - మంత్రి శ్రీధర్ మధ్య మాటల యుద్ధం



సంబంధిత వార్తలు

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన