Telangana Assembly Election 2023: కాంగ్రెస్‌కు వచ్చేది 20 సీట్లే, భట్టి గెలిచేది లేదు, సీఎం అయ్యేది లేదు, మధిర ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా మధిరలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు.

CM KCR (Photo/x/TS CMO)

Madhira, Nov 21: తెలంగాణ ఎన్నికలు మరో 10 రోజుల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంది.అధికార బీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ మీటింగ్ లతో దూసుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా మధిరలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు.

ఆ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడుతూ.. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ అవతరించిందని తెలిపారు. బీఆర్ఎస్ అభ్య‌ర్థి లింగాల క‌మ‌ల్‌రాజ్‌కు మ‌ద్దతుగా ఆయన ప్ర‌సంగించారు.. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గుణం చూడాలని అన్నారు.బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే రైతు బంధు ఏడాదికి రూ. 16 వేలు ఇస్తామన్న కేసీఆర్‌.. 24 గంటల విద్యుత్‌ ఉండాలంటే మళ్లీ బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.

హంగ్ లేదు బొంగు లేదు, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ ఉచ్చులో తెలంగాణ ప్రజలు పడరని తెలిపిన హరీష్ రావు, పీటిఐకి ఇచ్చిన ఇంటర్యూలో తెలంగాణ మంత్రి

దళిత సమాజం దోపిడీకి గురైందన్నారు సీఎం కేసీఆర్‌. దళితుల పేదరికం తొలగించేందుకు దళితబంధు తీసుకొచ్చామని తెలిపారు. దళితబంధు లాంటి ఆలోచన కాంగ్రెస్‌ ఏనాడైనా చేసిందా అని ప్రశ్నించారు. మధిరలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇస్తున్నామని చెప్పారు. రైతుబంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్‌ఎస్‌ అని తెలిపారు. పాత మెజార్టీ కంటే రెండు సీట్లు పెంచుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం వ‌స్తుందని, అందులో మీకు ఎలాంటి అనుమానం అవ‌స‌రం లేదని అన్నారు.

దళితబంధులో BRS ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారు..నల్గోండలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మధిరకు చుట్టపుచూపుగా వస్తారని కేసీఆర్‌ విమర్శించారు. భట్టి గెలిచేది లేదు, సీఎం అయ్యేది లేదని దుయ్యబట్టారు. భట్టి చేసిందేమి లేదని, ద‌ళిత‌వ‌ర్గం ఒక్క ఓటు కూడా ఆయనకు వేయొద్దని హితవు పలికారు. ఈ ప‌ట్టి లేని భ‌ట్టి విక్ర‌మార్క‌కు ఓటేస్తే మీకు వ‌చ్చేది ఏంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి బంగాళాఖాతంలో వేస్తామన్నారన్న విషయాన్ని ప్రస్తావించారు. ధరణి స్థానంలో భూమాత తెస్తామంటున్నారని.. కాంగ్రెస్‌ తెచ్చేది భూమాత కాదు, భూమేత అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ గెలిచేది లేదు సచ్చేది లేదని.. ఆ పార్టీకి ఈసారి 20 కంటే ఎక్కువ సీట్లు రావని జోస్యం చెప్పారు.

50 ఏళ్లల్లో కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారు: వైరాలో సీఎం కేసీఆర్

వైరాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉన్న బలమైన ఆయుధం.. ఓటు. సరిగా ఆలోచించి సరైన వ్యక్తికి ఓటేస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ఏ రాష్ట్రం అయినా బాగుపడిందా.. లేదా.. అనేది చెప్పడానికి కొన్ని అంశాలు ఉంటాయి. వాటిలో ప్రధానమైనది తలసరి ఆదాయం. ఇవాళ తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. కాంగ్రెస్‌ హయాంలో పట్టణాలు, గ్రామాల పరిస్థితి ఎలా ఉండేదో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇప్పుడు భారాస తీసుకొచ్చిన మార్పులు ఎలా ఉన్నాయో కూడా ప్రజలు గమనించవచ్చు. ఎన్నో అద్భుతమైన పనులు చేసుకున్నాం. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పరిపాలనలో ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయి? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్లలో ఎలాంటి మార్పులు వచ్చాయో ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాను.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు జరిగిన మంచి ఏదీ లేదు. లేనోడు మరింత పేదోడిగా మారిపోయారు. ఎవరికీ ఎలాంటి ప్రయోజనం జరగలేదు. వైరా ప్రాజెక్టు కింద నీళ్లు పారితే గతంలో పన్నులు వసూలు చేశారు. బీఆర్ఎస్ వచ్చాక పన్నులు రద్దు చేశాం. పోడు భూముల పంపిణీ కింద 3,650 కుటుంబాలకు 7,140 ఎకరాలకు పట్టాలు ఇచ్చాం. పోడు భూములు ఇవ్వడంతో పాటు రైతుబంధు అమలు చేస్తున్నాం. 3,659 తండాలను గ్రామా పంచాయతీలుగా మార్చాం. వైరాలో 45 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం. 50 ఏళ్లల్లో కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయింది ఈ కాంగ్రెస్‌. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు పూర్తి చేసి ఇంటింటికీ మంచి నీరు ఇవ్వలేకపోతే.. ఓట్లు అడగమని చెప్పా. చెప్పినట్టుగానే పూర్తి చేశాం.. మంచినీరు అందించాం. ఇవాళ తెలంగాణలో అమలవుతున్న పథకాలు, జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరూ గమనించాలి.



సంబంధిత వార్తలు

Navya Haridas File Petition In Kerala HC: ప్రియాంక గాంధీ ఎంపీగా అన‌ర్హురాలు, త‌ప్పుడు మార్గంలో గెలిచారు, హైకోర్టులో పిటీష‌న్ వేసిన బీజేపీ అభ్య‌ర్ధి

KTR On Rythu Bharosa: రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్

Telangana Assembly Sessions: అసెంబ్లీని కుదిపేసిన ఫార్ములా ఈ కార్ రేసు అంశం, కేటీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్, కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో కుదరదన్న ప్రభుత్వం

Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif