Bandi Sanjay: బీజేపీ కార్యకర్తల తలల పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, లా అండ్‌ ఆర్డర్‌ చేతకాకుంటే సీపీ ఇంట్లో కూర్చోవాలని మండిపడిన బండి సంజయ్

జనగామ జిల్లాలోని దేవరుప్పుల ఘటనతో పోలీస్‌ సెక్యూరిటీని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరాకరించారు.భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవాలని నా భద్రతను తన కార్యకర్తలే చూసుకుంటారని తేల్చి చెప్పారు. బీజేపీ కార్యకర్తల తలల పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.

BJP-Chief-Bandi-Sanjay (Photo-Video Grab)

Hyd, August 15: జనగామ జిల్లాలోని దేవరుప్పుల ఘటనతో పోలీస్‌ సెక్యూరిటీని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరాకరించారు.భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవాలని నా భద్రతను తన కార్యకర్తలే చూసుకుంటారని తేల్చి చెప్పారు. బీజేపీ కార్యకర్తల తలల పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. లా అండ్‌ ఆర్డర్‌ చేతకాకుంటే సీపీ (Bandi Sanjay Serious Comments) ఇంట్లో కూర్చోవాలన్నారు.దాడి ఘటనపై వెంటనే డీజీపీ (DGP)స్పందించాలని డిమాండ్‌ చేశారు.

పాదయాత్ర ప్రశాంతంగా జరిగేలా చాడాలని అన్నారు. లేదంటే గాయపడ్డ కార్యకర్తలను తమ దగ్గరికి తీసుకొస్తానని సవాల్‌ విసిరారు. జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పోలీసులకు జీతాలు కేసీఆర్ జేబుల్లోంచి ఇస్తున్నారా? అని నిలదీశారు.

టీఆర్ఎస్ నేతను హత్య చేసి రెండు చేతులను తీసుకెళ్లిన దుండగులు,తెల్దారుపల్లిలో దారుణ హత్య కలకలం, 144 సెక్షన్‌ విధించిన పోలీసులు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తిన విషయం తెలిసిందే. దేవరుప్పల సభలో సంజయ్‌ ప్రసంగిస్తుండగా.. టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని బండి సంజయ్‌ ప్రశ్నించారు. దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని సంజయ్‌ను టీఆర్‌ఎస్‌ నేత అడగడంతో వివాదం మొదలైంది.టీఆర్ఎస్ కార్యకర్తలు సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షమ జరిగింది. పరస్పరం రాళ్లు విసురుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement