Telangana Cabinet: 25న తెలంగాణ కేబినెట్ సమావేశం, బడ్జెట్‌కు అమోదం తెలపనున్న కేబినెట్, ఈ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్
ఈ నేపథ్యంలో ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.
Hyd, July 20: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అదే రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఉదయం 9 గంటలకు అసెంబ్లీ హాలులో కేబినెట్ భేటీ కానుంది. ఇక శాసనమండలి సమావేశాలు ఈ నెల 24 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
బడ్జెట్ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇవాళ వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సంబంధించిన త్వరితగతిన సమాచారంతో సమాధానాలు పంపాలని అధికారులను ఆదేశించారు.
25న బడ్జెట్ ప్రశేశ పెట్టనుండగా ఆ తర్వాత వివిధ శాఖల డిమాండ్లపై చర్చ జరగనుంది. నోట్ ఆన్ డిమాండ్ రూపొందించి బడ్జెట్‌ను సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు సీఎస్. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుండగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రసంగం చేయనున్నారు.
ఇక ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ప్రధానంగా పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగ సమస్యపై చర్చ జరగనుండగా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ఈసారైన హాజరవుతారా లేదా అన్న సందేహం అందరిలో నెలకొంది. భారీ వర్షాలకు కొట్టుకుపోయిన ఖమ్మం జిల్లా పెద్దవాగు, నీటమునిగిన మూడు గ్రామాలు, హెలికాప్టర్లతో ప్రజల తరలింపు