Telangana Cabinet Meet: తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం, ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లు ఖరారు చేసే అవకాశం, కవితకు ఈడీ నోటీసులపై కేబినెట్‌లో చర్చించే ఛాన్స్, పెన్షన్లు, జీతాల పెంపుపై ప్రధానంగా చర్చ
ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటూ పెన్షన్లు, జీతాల పెంపుపై కేబినెట్ (Telangana Cabinet Meet) చర్చించనుంది. అనంతరం గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను కేబినెట్ ఫైనల్ చేయనుంది.
Hyderabad, March 09: ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం (Telangana Cabinet Meet) కానుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటూ పెన్షన్లు, జీతాల పెంపుపై కేబినెట్ (Telangana Cabinet Meet) చర్చించనుంది. అనంతరం గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను కేబినెట్ ఫైనల్ చేయనుంది. వాటిని గవర్నర్ కు పంపించనుంది. మరోవైపు శుక్రవారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ సహా రాష్ట్ర కార్యవర్త సంయుక్త సమావేశం జరుగబోతుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులతోపాటు పార్టీ ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు.
కవితకు (MLC Kavitha) ఈడీ నోటీసులతో కేబినెట్, బీఆర్ఎస్ మీటింగ్ కు ప్రాధాన్యత ఏర్పడింది. మార్చి10న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం కూడా జరుగబోతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor scam) ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో మార్చి9న జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను అధికారులు విచారించబోతున్నారు. ఈ కేసులో గతంలోనే ఈడీ కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో విచారించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, ముడుపుల అంశం వంటి అంశాలపై కవితను ప్రశ్నించే అవకాశం ఉంది.
ఈ కేసుకు సంబంధించి గతంలో దాఖలు చేసిన చార్జిషీటులో రామచంద్ర పిళ్లై పాత్రను ఈడీ ప్రస్తావించింది. పిళ్లైపై అనేక అభియోగాలు నమోదు చేసింది. కవిత తరఫున అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకున్నారని చార్జిషీటులో ఈడీ పేర్కొంది. ఈ కేసులో మరో నిందితుడు సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జిషీటులో కూడా ఈడీ కవిత పేరును ప్రస్తావించింది. మరోవైపు ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల జారీ చేయడంపై తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమావేశంలో మంత్రివర్గ సిఫార్సుపై గవర్నర్ ఆమోదించే రెండు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు సమాచారం.