Telangana Cabinet Meeting: ఈ నెల 4న‌ తెలంగాణ కేబినెట్ స‌మావేశం, అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు స‌హా ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించనున్న మంత్రివ‌ర్గం

రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల నిర్వహణతో పాటు కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లోని రెండు స్కీమ్‌ల అమలుపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ తేదీని అధికారికంగా నిర్ణయించనున్నారు.

Telangana Cabinet Meeting (Photo-X)

Hyderabad, FEB 02: ఈ నెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్‌ (Telangana Cabinet Meeting) సమావేశం కానుంది. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల నిర్వహణతో పాటు కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లోని రెండు స్కీమ్‌ల అమలుపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ తేదీని అధికారికంగా నిర్ణయించనున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్‌ (Budget) సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 9వ తేదీన గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేయనున్నారు.

Telangana: తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్, రూ. 500కే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటన 

ఇక 10వ తేదీన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ (Vote on Account) ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. 11వ తేదీ ఆదివారం సెలవుదినం వదిలేస్తే.. 12వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.