Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ అధ్యక్షతన భేటీ.. ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు ఉండొచ్చని అంచనాలు

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది.

cm revanth reddy

Hyderabad, Mar 12: మరికొద్ది రోజుల్లో లోక్‌ సభ ఎన్నికలు (Loksabha Elections) ఉన్న నేపథ్యంలో నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం (Telangana Cabinet Meeting) కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు వడ్డీలేని రుణ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైన నిధుల కేటాయింపు, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఆమోదం, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆమోదించడం, రైతు భరోసా పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి అవసరమైన మార్పుచేర్పులు వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలపైనా నిర్ణయం తీసుకోనున్నారు.

CAA Rules Notified: సీఏఏ అమల్లోకి తెస్తున్నట్లు కేంద్రం సంచలన ప్రకటన, ఢిల్లీలో పలుచోట్ల భద్రత కట్టుదిట్టం, పౌరసత్వ సవరణ చట్టం అసలేం చెబుతోంది ?

భారీ మహిళా సదస్సు

నేటి సాయంత్రం నాలుగున్నర గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌ లో ప్రభుత్వం భారీ మహిళా సదస్సు నిర్వహిస్తోంది. ఇందులో మహిళలకు జీరో వడ్డీ, స్వయం సహాయక సంఘాలకు బీమా కల్పన వంటి వాటిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

మిషన్ దివ్యాస్త్రను ప్రకటించిన ప్రధాని మోదీ, భారత్‌లో తొలిసారిగా అగ్ని-5 క్షిపణి ప్రయోగాత్మక పరీక్షలు

 



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఇది ఆర్ధిక సాయం కాదు…ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహం, సివిల్స్‌లో మనవాళ్లే రాణించాలన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy On New Ration Cards: జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు

Telangana Cabinet Decisions: రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రైతులకు పెట్టుబడి సాయం, రేషన్‌ కార్డులపై కేబినెట్ భేటీలో నిర్ణయం

KTR Slams CM Revanth Reddy: పర్రె మేడిగడ్డకు పడలే.. రేవంత్ పుర్రెకు పడ్డది..చిల్లర రాతలు రాయించేవారిని వదిలిపెట్టం, దేశంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు వస్తుందన్న కేటీఆర్