Munugode Bypoll 2022: ముగిసిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారం, ఈ నెల 3న పోలింగ్, నవంబర్ 6న ఫలితం, మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు

నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక (Polling would be held on November 3) జరగనుంది. ఈ నెల 6వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక కౌటింగ్‌ (Result will be declared on November 6) జరగనుంది.

Polls 2021 | (Photo-PTI)

Munugode, Nov 1: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం (Campaign for Munugode bypoll ends) ముగిసింది. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక (Polling would be held on November 3) జరగనుంది. ఈ నెల 6వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక కౌటింగ్‌ (Result will be declared on November 6) జరగనుంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రచారం ముగియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మునుగోడు పరిధిలోని అన్ని లాడ్జిలు, హోటల్స్‌ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బయటి వ్యక్తులను ఖాళీ చేయిస్తున్నారు. ఓటర్లకు ప్రలోభానికి గురి చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు.

మునుగోడు ఉపఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు నిలిచారు. మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో మొత్తం 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు భద్రతను పటిష్టం చేశారు.మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కారుపై దాడి, మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు, కర్రలతో కొట్టుకున్న ఇరువర్గాలు

నవంబర్‌ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఐదు వేల మంది పోలీస్‌ సిబ్బందిని మోహరిస్తారు. 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. పోలింగ్‌ నిర్వాహణ కోసం 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి.45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. నవంబర్ 6న మునుగోడు ఉపఎన్నిక ఫలితం వెలువడనుంది.