మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈటల వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా రాళ్ల దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు ఈటల రాజేందర్.
ఏం జరిగినా పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేశారు.బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై దాడి జరిగిన క్రమంలో టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తి.. పరస్పరం దాడి చేసుకున్నారు. ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బీజేపీ ప్రచార రథానికి ఉన్న బ్యానర్లను చించేశారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు.
మునుగోడు మండలం పలివెల గ్రామంలో ఈటెల రాజేందర్ @Eatala_Rajender గారి ప్రచార సభపై పల్లా రాజేశ్వర్ రెడ్డితో వచ్చిన తెరాస గూండాలు రాళ్లతో దాడి.
కొందరికి గాయాలు, వాహనాలు ధ్వంసం.
ఓడిపోతున్నమని తెలిసి, దొరకు ఏం చెప్పాలో తెలియక, దాడికి దిగిన పల్లా.#TRSDramas pic.twitter.com/1wwsZw0IbF
— Kishore Poreddy (@krporeddy) November 1, 2022
పలివెల :
ఈటెలరాజేందర్ పై రాళ్ళ దాడి చేసిన trs
దగ్గర ఉండి దాడి చేయించిన పల్లా రాజేశ్వర రెడ్డి
పలువురు కి రక్త గాయాలు
గాయపడ్డ ఈటల వ్యక్తి గత సిబ్బంది
ఈటెలరాజేందర్ వాహనం ద్వంసం pic.twitter.com/cdgRrOFQSL
— Eatala Rajender BJP (@eatala_bjp) November 1, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)