Property Registration in TS: వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ గడువు మరో 10 రోజులు పొడిగింపు, చట్ట సవరణకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం, కేబినెట్‌ సమావేశంలో పలు బిల్లులకు ఆమోదముద్ర

ఇందులో భాగంగానే శనివారం రోజున సీఎం కేసీఆర్ (Telangana Chief Minister K Chandrashekhar Rao) ఆస్తి వివరాలను అధికారులకు తెలిపారు.

Telangana CM KCR | File Photo

Hyderabad, Oct 11: తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ (Property Registration in TS) సాగుతున్నది.ఇటీవలే ప్రభుత్వం చేపట్టిన పలు కీలక సంస్కరణల్లో భాగంగా అధికారులు గ్రామ స్థాయి నుంచి నివాస వివరాలను నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం రోజున సీఎం కేసీఆర్ (Telangana Chief Minister K Chandrashekhar Rao) ఆస్తి వివరాలను అధికారులకు తెలిపారు.

అనంతరం ఆయన పూర్తి ఆస్తివివరాలను అధికారులు ఆన్‌లైన్‌లో న‌మోదు చేశారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం నివాసానికి గ్రామ కార్యద‌ర్శి సిద్దేశ్వర్‌ వచ్చి ఆస్తి వివరాలను నమోదు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ కూడా సాధారణ ప్రజల మాదిరిగానే త‌న కుటుంబ ఆస్తుల వివ‌రాల‌ను తెలిపారు.

గృహ వివరాలతో పాటు వ్యవసాయేతర వివరాలను ఆయన తెలియజేశారు. దీంతో అధికారులు వెంటనే ఆస్తుల న‌మోదు యాప్‌లో నివాస గృహానికి చెందిన వివరాలను ఫోటోతో సహా ప్రత్యేకించిన యాప్‌లో న‌మోదు చేశారు. ఈనెల 15లోపు ప్రతిఒక్కరు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సీఎం సూచించారు.

ఇదిలా ఉంటే వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ గడువును ఇంకో 10 రోజుల పాటు పొడిగించారు. ఈ నెల 20 వరకు ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆన్‌లైన్‌లోనే నాలా కన్వర్షన్‌ చేసేలా ప్రతిపాదించిన చట్ట సవరణకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రిజిస్ట్రేషన్‌ చట్టానికి స్వల్ప సవరణలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సగం సీట్లు మహిళలకు ఇవ్వడంతో పాటు డివిజన్ల రిజర్వేషన్‌ల రూపకల్పన చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం రాత్రి ప్రగతిభవన్‌లో నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో పలు బిల్లులకు ఆమోదముద్ర పడింది. ఈ నెల13,14 తేదీల్లో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో వీటిని ప్రవేశపెట్టి ఉభయ సభల ఆమోదం పొందనున్నారు.

తెలంగాణలో రిస్క్ చాలా తక్కువ, తాజాగా 1,717 మందికి కరోనా, ఐదు మంది మృతితో 1,222 కి పెరిగిన మరణాల సంఖ్య, యాక్టివ్‌గా 25,713 కేసులు

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమి(నాలా కన్వర్షన్‌)గా మార్చే విచక్షణాధికారం దుర్వినియోగం కాకుండా చేసేందుకు ఆన్‌లైన్‌లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రతిపాదించిన రెవెన్యూ చట్టంలో ఈ మేరకు సవరణలు ప్రతిపాదించింది. ధరణి పోర్టల్‌ ద్వారా సంబంధిత వివరాలతో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే ఆటోమేటిక్‌గా నాలా కన్వర్షన్‌ చేసేలా చట్టాన్ని సవరించింది. రిజిస్ట్రేషన్‌ల చట్టానికి కొన్ని సవరణలు ప్రతిపాదించగా వాటికి కేబినెట్‌ ఓకే చెప్పింది.

జీహెచ్‌ఎంసీ చట్టం1995కు సవరణలు చేసింది. గ్రేటర్‌లో సగం డివిజన్‌లను మహిళలకు రిజర్వ్‌ చేశారు. పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడంతో పాటు డివిజన్‌ల రిజర్వేషన్‌ల అంశంలోనూ సవరణలకు ఆమోదం తెలిపారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ విధానంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. రైతుల నుంచి పంటను ఈ సీజన్ లో గ్రామాల్లోనే కొనుగోలు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే 17 శాతానికి మించకుండా తేమ ఉండేలా చూసుకుని, తాలు, పొల్లు లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలని రైతులకు సూచిస్తున్నారు. వడ్ల కొనుగోలులో ఆందోళన వద్దని, ఎన్ని రోజులైనా పంటను కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వడ్లను కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని సూచించారు. దేశంలో అవసరానికి మించి మొక్కజొన్నల నిల్వలు ఉన్నా, విదేశాల నుంచి దిగుమతికి కేంద్రం అనుమతి ఇవ్వడంపై కేబినెట్‌ విస్మయం వ్యక్తం చేసింది. మొక్కజొన్న రైతులకు మద్దతు ధర వచ్చే అవకాశం లేదని, రైతులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ సూచించింది.

రాష్ట్రవ్యాప్తంగా 5,690 సెంటర్లలో వడ్లు కొనుగోలు చేయనున్నట్లు సివిల్‌ సప్లయ్స్ డిపార్ట్​మెంట్​శనివారం ప్రకటించింది. ఇంకా కొనుగోలు కేంద్రాలు ఎక్కడైనా అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఏ గ్రేడ్‌ వడ్లు క్వింటాల్‌కు రూ.1,888, కామన్‌ రకం వడ్లు రూ.1,868 మద్దతు ధర చెల్లించి కొంటామని ఉత్తర్వులలో పేర్కొంది.



సంబంధిత వార్తలు

Nitin Gadkari on Same-Sex Marriages: స్వలింగ వివాహాలను అనుమతిస్తే ఒక పురుషుడికి ఇద్దరు భార్యలను కూడా అనుమతించాలి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు