CM KCR Delhi Tour: ముగిసిన తెలంగాణ సీఎం ఢిల్లీ టూర్, చివరి రోజు ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ, రాష్ట్రానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రధానికి విజ్ఞప్తి

దీంతో ఆయన హైదరాబాద్‌కు బయల్దేరారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో పాటు... పలువురు కేంద్రమంత్రులను కేసీఆర్‌ కలిశారు. చివరి రోజు ప్రధాని మోదీని (PM Narendra Modi) కలిసారు. ఈ సంధర్భంగా రాష్ట్రానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (Telangana CM K Chandrasekhar Rao) ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు.

KCR met PM Modi (Photo-Twitter/TS CMO)

Hyderabad, Dec 13: తెలంగాణ సీఎం కేసీఆర్‌ మూడు రోజుల ఢిల్లీ టూర్‌ (CM KCR Delhi Tour) ముగిసింది. దీంతో ఆయన హైదరాబాద్‌కు బయల్దేరారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో పాటు... పలువురు కేంద్రమంత్రులను కేసీఆర్‌ కలిశారు. చివరి రోజు ప్రధాని మోదీని (PM Narendra Modi) కలిసారు. ఈ సంధర్భంగా రాష్ట్రానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (Telangana CM K Chandrasekhar Rao) ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు.

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, వరద సాయంగా తాము అడిగిన రూ.1,350 కోట్లను అందించాలని కోరారు. వరదసాయంగా రూ.1,350 కోట్లు విడుదలచేయాలని కోరుతూ లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేసినట్టు సమాచారం. దీంతో పాటు తెలంగాణలో అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ.25వేల కోట్లు అందించాలని నీతి ఆయోగ్‌ సూచించిందని, ఈ విషయంలో సహకారం అందించాలని సైతం మోదీని కోరారు.దీంతో పాటు రాష్ట్రంలో కరోనావైరస్ పరిస్థితులు, తీసుకుంటున్న చర్యల గురించి కూడా చర్చింనట్లు సమాచారం.

Here's TS CM Met PM in New Delhi

అంతకుముందు ఆయన కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురిని కలుసుకున్నారు. రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు తక్షణమే కేంద్ర పౌరవిమానయాన శాఖ అనుమతులు ఇవ్వాలని, వాటితోపాటు సిద్దిపేట విమానాశ్రయంపై నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ప్రధానమంత్రిని కోరినట్టు తెలిసింది.

తెలంగాణలో ఆరు జాతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతివ్వండి, విమానయాన శాఖ మంత్రిని కోరిన సీఎం కేసీఆర్, మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం బిజీబిజీ

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ నిర్మించనున్న పార్టీ కార్యాలయం భవనంపై ప్రధాని మోదీ ఆరా తీసినట్టు సమాచారం. న్యూఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో తెలంగాణ భవన్‌ నిర్మాణానికి 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్రం కేటాయించినట్టు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ధన్యవాదాలు చెప్పినట్టు తెలిసింది.



సంబంధిత వార్తలు

CM Chandrababu Polavaram Visit Updates: పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు

Telangana Assembly Session 2024: తెలంగాణకు వెళితే చికున్ గున్యా వస్తుంది, అమెరికాలో చెప్పుకుంటున్నారంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి

CM Revanth Reddy: 98 శాతం కులగణన పూర్తి, తెలంగాణకు బహుజనుల తల్లి కావాలి...దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి