Hyderabad, Dec 12: మూడురోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ నిన్న ఢిల్లీ (CM KCR Delhi Tour) చేరుకున్నారు. రాష్ట్రంలో చాలారోజులుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంకోసం ఆయన సంబంధిత శాఖల మంత్రులను (Telangana CM Delhi Tour) కలుస్తున్నారు. తొలి రోజు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో (Gajendra Singh Shekhawat) సమావేశమయ్యారు.
నీటి ప్రాజెక్టులు, నదీ జలాల వినియోగానికి సంబంధించిన అంశాలపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ (KCR meets Union Home Minister Amit Shah) అయ్యారు. హైదరాబాద్‌లో వరద నష్టానికి ఆర్థిక సాయం చేయాలని కోరారు. నేడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌పురితో (Aviation Minister Hardeep Singh Puri) తెలంగాణ సీఎం సమావేశం అయ్యారు.
ఢిల్లీలో టీఆర్‌ఎస్‌కు పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించినందుకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గృహ నిర్మాణం, పౌర విమానయాన రంగాలకు సంబంధించిన ప్రాజెక్ట్‌లపై చర్చించారు. పట్టణాభివృద్ధికి నిధులు, వరంగల్, సిద్దిపేటలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.
Here's TS CM KCR Delhi Tour Visuasl
Chief Minister Sri K. Chandrashekar Rao met @MoCA_GoI Sri Hardeep Singh Puri Ji in New Delhi today. pic.twitter.com/1lszvgov5n
— Telangana CMO (@TelanganaCMO) December 12, 2020
Chief Minister Sri K. Chandrashekar Rao met Union Home Minister Sri @AmitShah Ji in New Delhi today. pic.twitter.com/bmKQ5Rr7O6
— Telangana CMO (@TelanganaCMO) December 11, 2020
CM Sri K. Chandrashekar Rao met Union Minister for @MoJSDoWRRDGR Sri Gajendra Singh Shekhawat Ji in New Delhi today. pic.twitter.com/VFTIQpxJ83
— Telangana CMO (@TelanganaCMO) December 11, 2020
తెలంగాణలో ఆరు డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు అనుమతి (New Airports) ఇవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌పురిని సీఎం కేసీఆర్ కోరారు. శనివారం మధ్యాహ్నం కేంద్ర మంత్రిని సీఎం కేసీఆర్ కలిసి రాష్ర్టంలో కొత్త ఎయిర్‌పోర్టుల అంశంపై చర్చించి ఓ లేఖను అందజేశారు. పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్, వరంగల్ అర్బన్ జిల్లాలోని మామునూర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు.
రాష్ర్టంలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సంబంధించి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌తో సంప్రదింపులు జరిపినట్లు సీఎం కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి 2018లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు నివేదిక కూడా పంపించడం జరిగిందని కేసీఆర్ తెలిపారు. చిన్న విమానాల కోసం ఫ్రిల్స్ విమానాశ్రయాలు మాత్రమే అభివృద్ధి చేయబడుతాయని నివేదిక సూచించిందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. మొత్తం 6 చోట్ల దేశీయ విమానాశ్రయాల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన అబ్ స్టాకిల్ లిమిటేషన్ సర్ఫేస్ సర్వే, సాయిల్ టెస్ట్, ఇతర పరిశీలన డ్రాఫ్ట్ రిపోర్టు తాజాగా వచ్చిందని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.
నూతన ఎయిర్‌పోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను సీఎం కేసీఆర్ కోరారు. ఎయిర్‌పోర్టు సైట్‌లను ఖరారు చేయడంలో సింగిల్ విండో ప్రతిపాదికన అన్ని చట్టబద్దమైన అనుమతులు ఇవ్వాలని కోరారు. నాన్ - షెడ్యూల్డ్ ఆపరేటర్స్ పర్మిట్ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సొంత నిధులతో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ లేఖలో స్పష్టం చేశారు.