Swapnalok Complex Fire Mishap: స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

CM KCR (Photo-ANI)

సికింద్రాబాద్ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ప్రమాద ఘటన పై ఒక కమిటీ వేస్తున్నట్లు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత తెలిపారు. గతంలో కూడా ఈ పరిధిలో రెండు మూడు ప్రమాదాలు జరిగాయన్న ఆమె..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌ అగ్నిప్రమాదంలో ఆరుగురి సజీవ దహనం.. మృతులందరూ కాల్ సెంటర్ ఉద్యోగులే.. బాధితుల్లో నలుగురు యువతులు, ఇద్దరు యువకులు.. ప్రమాదానికి గల కారణంపై ఇంకా అస్పష్టత

స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్నిప్రమాద ఘటనపై సికింద్రాబాద్‌లోని మహంకాళి పోలీసులు కేసు నమోదు చేశారు. కాంప్లెక్స్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేర సెక్షన్‌ 304 పార్ట్ 2, 324, 420 ఐపీసీ, సెక్షన్ 9 (బి) పేలుడు పదార్థాల చట్టం, 1884 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Here's CMO Tweet

భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమైన స్వప్నలోక్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ అసోసియేషన్‌, కేడియా ఇన్ఫోటెక్‌ లిమిటెడ్‌, వికాస్‌ పేపర్‌ ఫ్లెక్సో ప్యాకేజింగ్‌ లిమిటెడ్‌, క్యూనెట్‌, విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.