New Government Medical Colleges in Telangana: తెలంగాణలో ఒకేసారి 9 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం, రాష్ట్ర చ‌రిత్ర‌లో ఉజ్వ‌ల‌మైన దినం ఈ రోజని తెలిపిన సీఎం కేసీఆర్

ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

CM KCR Virtually Inaugurating 9 New Medical Colleges (Photo Credits: X/@MissionTG)

Hyd, Sep 15: తెలంగాణలో ఒకే రోజు 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఈ రోజు మరుపురానిదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఏడాదికి 10 వేల మంది డాక్టర్లు తయారవుతున్నారని అన్నారు. కొత్తగా ప్రారంభించిన వాటితో కలిపి రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య నాలుగు రెట్లకు పెరిగింది.

రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 26కి చేరింది. కొత్త కాలేజీలతో కలిపి తెలంగాణలో మెడికల్ సీట్ల సంఖ్య 8,515కు పెరిగింది.తెలంగాణ‌లో ప్ర‌తి జిల్లాకు మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సంవ‌త్స‌రంలో దాదాపు 24 వ‌ర‌కు చేరుకున్నాం. గ‌తంలో ఐదు మెడిక‌ల్ కాలేజీలు ఉంటే.. ఇవాళ ఆ సంఖ్య 26కు చేరింది. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి 8 కాలేజీలు నూత‌నంగా ప్రాంరంభం కాబోతున్నాయి. వీటికి కేబినెట్ ఆమోదం కూడా ల‌భించింద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.

మహేష్ బ్యాంక్ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రెజంటేషన్‌, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు జాతీయస్థాయి అవార్డు

కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, భూపాలపల్లి, కుమరంభీమ్, సిరిసిల్ల,నిర్మల్, వికారాబాద్, జనగాం జిల్లాల్లో నూతనంగా మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ కలను సాధిస్తున్నామని అన్నారు.

Here's TS CMO Tweet

బోధన కాలేజీలే కాకుండా అనుబంధ ఆస్పత్రులను కూడా నెలకొల్పినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. దీంతో 50 వేల పడకల్ని ఆక్సిజన్ బెడ్‌లుగా తయారు చేశామని స్పష్టం చేశారు. ప్రస్తుతం 500 టన్నుల ఆక్సిజన్‌ను రాష్ట్రంలో ఉత్పత్తి చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణను ఎగతాళి చేసినవాళ్లకు ఇదో మంచి ఉదాహరణ అని అన్నారు. దేశంలో వైద్య రంగంలో మూడో స్థానంలో తెలంగాణ ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలో మరణాల రేటు కూడా తగ్గించామని చెప్పారు.

దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ప్రతి లక్ష జనాభాకు 22 మెడికల్‌ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 500 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. రాష్ట్రంలో 10 వేల సూపర్‌ స్పెషాలిటీ బెడ్లు అందుబాటులో ఉన్నాయి.’’ అని కేసీఆర్‌ అన్నారు.పేద గర్భిణులకు కేసీఆర్‌ కిట్లు, న్యూట్రిషన్‌ కిట్లు అందిస్తున్నట్లు కేసీఆర్‌ గుర్తు చేశారు. ‘‘వారికి ఇబ్బంది లేకుండా అమ్మఒడి వాహనాలు ప్రారంభించాం. మతాశిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 76శాతం ప్రసవాలు జరుగుతున్నాయి.’’ అని కేసీఆర్‌ అన్నారు.



సంబంధిత వార్తలు

Celebs Pay Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రముఖుల నివాళి, గొప్ప గురువును కొల్పోయాను అన్న రాహుల్..మన్మోహన్ సేవలు చిరస్మరణీయం అన్న ఏపీ సీఎం

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Manmohan Singh-Telangana: మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి

Telangana Govt. Declares Holiday: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మ‌ర‌ణం.. విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు నేడు సెల‌వు ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. వారం రోజుల‌పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా సంతాప దినాలు