CM KCR at Bhoomi Puja: మతం, కులం పేరిట చిల్లర రాజకీయాలు, ఆల్వాల్ సభలో మండిపడిన తెలంగాణ సీఎం కేసీఆర్, మూడు మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు భూమి పూజలు

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని కొత్త‌పేట‌(ఎల్బీన‌గ‌ర్‌), ఎర్ర‌గ‌డ్డ చెస్ట్ హాస్పిట‌ల్(స‌న‌త్ న‌గ‌ర్‌), అల్వాల్‌లో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు (CM KCR Participate In Tims) ముఖ్య‌మంత్రి కేసీఆర్ భూమి పూజ‌లు (Alwal Bhoomi Puja) చేశారు.

CM KCR Nagarjuna Sagar Tour (Photo-Video grab)

Hyd, April 26: తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని కొత్త‌పేట‌(ఎల్బీన‌గ‌ర్‌), ఎర్ర‌గ‌డ్డ చెస్ట్ హాస్పిట‌ల్(స‌న‌త్ న‌గ‌ర్‌), అల్వాల్‌లో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు (CM KCR Participate In Tims) ముఖ్య‌మంత్రి కేసీఆర్ భూమి పూజ‌లు (Alwal Bhoomi Puja) చేశారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రులు హ‌రీశ్‌రావు, మ‌హ‌ముద్ అలీ, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌ల్లారెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, సుధీర్ రెడ్డి, మైనంప‌ల్లి హన్మంత్ రావు, వివేకానంద గౌడ‌, కాలేరు వెంక‌టేశ్‌, సాయ‌న్న‌, రాజ్య‌స‌భ స‌భ్యులు కే కేశ‌వ‌రావు, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు

వైద్య విధానాన్ని పటిష్టపరిచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (CM KCR) అన్నారు. మంగళవారం గచ్చిబౌలి, ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌, అల్వాల్‌లో టిమ్స్‌ ఆసుపత్రులకు భూమిపూజ అనంతరం అల్వాల్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో కరోనాలాంటి మహమ్మారిలాంటి వైరస్‌లు వస్తాయని నిపుణులు చెప్పారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మరి ఏం చేయాలంటే ఒక రాష్ట్రం గానీ, దేశం గానీ, ఒక నగరం గానీ ఎవరికైతే పటిష్టమైన వైద్య వ్యవస్థ ఉంటదో వారు తక్కువ నష్టం బయటపడుతారనీ, వ్యవస్థ బాగా ఉండదో వాళ్లు నష్టాలకు గురై లక్షల మంది చనిపోతారని చెప్పారన్నారు. వైరస్‌లను మొత్తం మెకానిజం ప్రపంచంలో లేదని, కంట్రోల్‌ చేసే వైద్య విధానం ఉందన్నారు.

తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు శుభవార్త, రాష్ట్ర పోలీసు శాఖ‌లో ఖాళీగా ఉన్న 16,027 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

మతం, కులం పేరిట కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. ‘గతంలో ఏం జరిగిందో.. రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మనందరం కూడా చూస్తున్నాం. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కొందరు మతం మీద, కొందరు కులంపేరు మీద చిల్లరమల్లర రాజకీయాలు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘దేశం అన్ని మతాలను, అన్నీ కులాలను సమాంతరంగా ఆదరించే గొప్ప భారతదేశం. దీన్ని చెడగొట్టుకుంటే, ఈ సామరస్య వాతావరణం చెడిపోతే మనం ఎటుకాకుండా పోతాం. ఒకసారి ఆ క్యాన్సర్‌ జబ్బు మనకుపట్టుకుంటే చాలా ప్రమాదంలో పడిపోతాం.

ఈ రోజు అనేక విషయాలు ఇవాళ పేపర్లలో చూస్తున్నరు. పలాన వాళ్ల షాపులో పువ్వులు కొనద్దు.. పలాన వారి షాపులో ఇది కొనద్దు.. అది కొనద్దని చెబుతున్నరు దీనిపై ప్రజలు ఆలోచన చేయాలి. మన భారతీయులు 13కోట్ల మంది విదేశాల్లో పని చేస్తున్నారు. ఒక వేళ వారందరినీ ఆ ప్రభుత్వాలు తిరిగి పంపిస్తే వాళ్లందరికీ ఉద్యోగాలు ఎవరివ్వాలి. ఎవరు సాదాలి? అని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో దాదాపు రూ.2.30లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం ఏడేళ్లలో. సుమారు 10, 15లక్షల మంది పిల్లలకు ఆ ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు దొరికినయ్‌. రేపు హైదరాబాద్‌లో సిటీలో 14వేల ఎకరాల్లో ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఫార్మా యూనివర్సిటీతో పాటు ఫార్మాసిటీ తేబోతున్నాం. జీనోమ్‌వ్యాలీలో తయారవుతున్న వ్యాక్సిన్లతో ప్రపంచానికే రాజధానిగా ఉన్నాం. ప్రపంచంలోనే 33శాతం టీకాలు తయారీ కేంద్రం హైదరాబాద్‌గా ఉంది.

దేశ విదేశాలకు చెందిన వారంతా ఇక్కడ ఫ్యాక్టరీలు పెడుతున్నారు. హైదరాబాద్‌కు పోతే విమానం దిగినా.. రైలు దిగినా.. బస్సు దిగినా ప్రశాంతంగా ఉంటది. బాగుంటది.. ఇక్కడ రకాల భోజనం దొరుకుతుందని.. అన్ని భాషలు మాట్లాడే వాళ్లుంటరు.. అందరు కలిసిబతుకుతున్నరంటే ఎవరైనా వస్తురు కానీ.. కత్తులు పట్టుకుంటరు.. తుపాకులు పట్టుకుంటరు.. 144 సెక్షన్‌ ఉంటదని, కర్ఫ్యూ ఉంటనీ, తన్నుకుంటరంటే ఎవరైనా వస్తారా?’ అంటూ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు.



సంబంధిత వార్తలు

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

ICC Champions Trophy 2025: ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ పూర్తి షెడ్యూల్‌ ఇదిగో..

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్