CM Revanth Reddy: ప్రపంచంతోనే పోటీ పడుతున్న తెలంగాణ, న్యూ జెర్సీలో భారీ కార్ల ర్యాలీ, పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టూర్

పది రోజుల పర్యటనలో భాగంగా అమెరికాకు చేరుకున్న సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం పలకగా ఇవాళ న్యూయార్క్‌లోని పలు సంస్థల ప్రతినిధులతో రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. న్యూజెర్సీలో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ కారు ర్యాలీలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Telangana CM Revanth Reddy America tour updates, Huge car rally at Newyork(X)

America, Aug 5: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. పది రోజుల పర్యటనలో భాగంగా అమెరికాకు చేరుకున్న సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం పలకగా ఇవాళ న్యూయార్క్‌లోని పలు సంస్థల ప్రతినిధులతో రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. న్యూజెర్సీలో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ కారు ర్యాలీలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. షెరటాన్ హోటల్ నుంచి రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌ వరకు ఈ ర్యాలీ జరుగగా పెద్ద ఎత్తున ఎన్నారైలు పాల్గొన్నారు.

అనంతరం ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ సమావేశానికి హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడుతోందని , పెట్టుబడులు పెట్టాలని ఎన్నారైలను కోరారు. పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలు ముందుకు వస్తే ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామిన వెల్లడించారు. ఎన్ఆర్‌ఐల సహకారంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో 30వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని, మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు.

తెలంగాణలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు కాబోతుందని, ఇందుకు సహకారం అందించాల్సిందిగా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాతో చర్చించామని తెలిపారు. గత పదేళ్లలో బీఆర్ఎస్‌ హయాంలో జరిగిన విధ్వాంసాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్, మాకైతే తెలంగాణ ఫస్ట్ 

Here's Video:

ఏకదాటిన 31 వేల కోట్ల రుణమాఫి చేసి పేదలకు అండగా ఉన్నాం.

ఆగస్టు 14 వరకు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగనుంది. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు. 5న న్యూయార్క్‌లోని కాగ్నిజెంట్, ఆర్సీఎం, టిబిసి, కార్నింగ్, జోయిటస్ సహా పలు సంస్థల ప్రతినిధులతో ,6న పెప్సికో, హెచ్‌సిఏ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. అలాగే ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశం కానున్నారు రేవంత్. అమెరికా పర్యటన తర్వాత 11న దక్షిణ కొరియా సియోల్‌కు చేరుకుంటారు.

Here's Video:

 దక్షిణ కొరియాలో యూయూ ఫార్మా, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీ, ఎల్‌ఎస్ హోల్డింగ్స్, హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. అనంతరం 14న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: 63 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ, సెర్ఫ్ ద్వారా ఉచితంగా పంపిణీ చేపట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..