CM Revanth Reddy: వరంగల్‌ గడ్డ నుంచి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రుణమాఫీ కాని రైతుల రుణాలన్నీ త్వరలో మాఫీ చేస్తామని ప్రకటన

తెలంగాణ గడ్డపై సూర్య, చంద్రులు ఉన్నంత వరకూ ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు, ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాను టీపీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యానని రేవంత్ రెడ్డి చెప్పారు.

Revanth Reddy (Photo/CMOTS)

Hyd, Nov 19: ఏడాది పాలన పూర్తి సందర్భంగా హనుమకొండ (hanumakonda)లోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వరంగల్‌ను అభివృద్ధి చేస్తే సగం తెలంగాణను వృద్ధిలోకి తీసుకొచ్చినట్లేనని సీఎం రేవంత్‌ (Revanth Reddy) రెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికంగా వరంగల్‌ (Warangal)ను అభివృద్ధి చేస్తామన్నారు.

తెలంగాణ గడ్డపై సూర్య, చంద్రులు ఉన్నంత వరకూ ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు, ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాను టీపీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యానని రేవంత్ రెడ్డి చెప్పారు. మీరు భుజాల మీద మోయబట్టే మేమంతా ఇవాళ వివిధ హోదాల్లో ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

విమానాశ్రయంతో వరంగల్ రూపురేఖలు మారనున్నాయన్నారు. చాలా రాష్ట్రాల్లో నాలుగైదు విమానాశ్రయాలు ఉన్నాయని.. తెలంగాణ (Telangana)లో మాత్రం ఇప్పటివరకు ఒకేఒక ఎయిర్‌పోర్టు ఉందన్నారు. గత ప్రభుత్వం చేయలేని పనులు తాము చేస్తుంటే పనులు చేస్తుంటే కుట్రలు, కిరాయి రౌడీలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

వీడియో ఇదిగో, సోనియా గాంధీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నా తక్కువే, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆడబిడ్డల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై ఉంది. 2014 నుంచి 2019 వరకూ బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రిగా లేరని ఆయన చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ మహిళలు ఇచ్చిన తీర్పుతో మెుదటి మంత్రివర్గంలోనే కొండా సురేఖ, సీతక్కకు మంత్రులుగా అవకాశం కల్పించామని సీఎం చెప్పుకొచ్చారు.

ఈ ఓరుగల్లు ఆడబిడ్డలకే మంత్రివర్గంలో ప్రముఖస్థానం ఇచ్చి నేటి సభా నిర్వహణ కార్యక్రమాన్ని సైతం వారి చేతుల్లోనే పెట్టామని రేవంత్ తెలిపారు. ఇదే కాకుండా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కడియం కావ్యను పార్లమెంట్‌కు పంపించామని ఆయన చెప్పారు. ఆమె తెలంగాణ సమస్యలపై పార్లమెంట్‌లో గళం విప్పుతోందని అన్నారు.దుర్బుద్ధితో అభివృద్ధి పనులను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వీడియో ఇదిగో, తెలంగాణలో తిరిగే కేసీఆర్ అనే మొక్కను పెరగనీయను, కాస్కో ఇక చూసుకుందామంటూ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్

ఆడబిడ్డలను కోటీశ్వరులుగా మార్చేందుకు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. గత ప్రభుత్వంలో కొన్నేళ్లపాటు మహిళా మంత్రి కూడా లేరని గుర్తు చేశారు. కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసేందుకు గత ప్రభుత్వానికి పదేళ్లపాటు మనసొప్పలేదని, ఎంతో పట్టుదలతో కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేశామన్నారు. ‘‘వరంగల్‌ గడ్డ నుంచి రైతులందరికీ మరోసారి మాట ఇస్తున్నా. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రూ.2లక్షలలోపు రుణమాఫీ వర్తించలేదు. ఇచ్చిన మాట ప్రకారం రుణాలన్నీ మాఫీ చేస్తాం’’ అని సీఎం ప్రకటించారు.

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేలా బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తే జైల్లో పెడతాం. తెలంగాణలో కేసీఆర్ తాగుబోతుల సంఘాన్ని తయారు చేశారు. ఫుల్, ఆఫ్‌కు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్. ప్రజలను మత్తుకు బానిసలుగా చేసి అధికారం చెలాయించారు. బీఆర్ఎస్ అధికారం దిగిపోతే కేసీఆర్, కుటుంబ సభ్యుల ఉద్యోగాల ఊడాయి తప్ప.. రాష్ట్రానికి ఏం కాలేదు. కేసీఆర్.. హాయిగా మీరు ఫామ్ హౌస్‌లో పడుకోండి. అవసరమైతే అక్కడే వైన్ షాప్ ఏర్పాటు చేయిస్తా. మీ ఉద్యోగాలు పోయాయి కాబట్టి రైతులకు రుణమాఫీ జరుగుతోంది.

ఇంకా కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు. కచ్చితంగా చేసి తీరుతాం. అభివృద్ధిపై చర్చకు బిర్లా-రంగాలు సిద్ధమా..? రైతు రుణమాఫీ చేస్తే అభినందించాల్సిందిపోయి విమర్శిస్తున్నారు. వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అనలేదా?. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అసెంబ్లీకి వచ్చి చెప్పాలి. నువ్వు ఎప్పుడంటే అప్పుడు అసెంబ్లీ పెట్టిస్తా. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి. ఆయన రాకుండా ఇద్దరు చిల్లరగాళ్లను పంపుతున్నారు. ఆఖరి రక్తపు బొట్టు వరకూ ప్రజల కోసం పనిచేస్తా. తెలంగాణలో కేసీఆర్ మొక్కను మళ్లీ మొలవనివ్వను. దమ్ముంటే అసెంబ్లీకి రా.. చర్చిద్దామని సవాల్ విసిరారు.

మాజీ సీఎం కేసీఆర్‌ మాట ఇచ్చి.. పదేళ్లలో రుణమాఫీ చేయలేదని సీఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం ఆరు నెలల్లోనే రుణమాఫీకి రూ.18వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఒక్కసారి ఓడిస్తే.. మళ్లీ ప్రజల మొహం చూడరా? అధికారం ఇస్తే దోచుకోవడం.. ఓడిస్తే ఫామ్‌హౌస్‌లో కూర్చోవడమేనా మీ పని అని ప్రశ్నించారు.

ప్రజల మీద ప్రేమ ఉంటే ఎందుకు ప్రజల మధ్యకు రావడం లేదని నిలదీశారు. నిజంగా ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ల మధ్యకు వచ్చి ఎందుకు అడగటం లేదన్నారు. రాహుల్‌ గాంధీని చూసి కేసీఆర్‌ బుద్ధి తెచ్చుకోవాలన్నారు. మూడుసార్లు అధికారం దక్కకపోయినా.. రాహుల్‌ గాంధీ ప్రజల మధ్యే ఉన్నారని గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ తన బాధ్యతను ఎందుకు నిర్వర్తించడం లేదని నిలదీశారు.

తెలంగాణను అవమానించిన, వ్యతిరేకించిన ప్రధాని మోదీ(PM Modi)కి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy) ఊడిగం చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. గెలిపించిన సికింద్రాబాద్‌ ప్రజలను కిషన్‌ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. గుజరాత్‌లో సబర్మతి సుందరీకరణను సమర్థించి.. మూసీ సుందరీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు.

సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అందుకే ఆమె కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్నా తప్పులేదు. కాళోజీ కళాక్షేత్రం పదేళ్లైనా మీరెందుకు పూర్తిచేయలేదు. తెలంగాణ భావాన్ని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి కాళోజీ నారాయణరావు. అందుకే కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేశాం. మీరు అభివృద్ధి చేసేవాళ్ల కాళ్లలో కట్టె పెట్టొద్దు. అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు. వరంగల్‌ను హైదరాబాద్‌కు పోటీ నగరంగా తీర్చుదిద్దుతున్నాం. అందుకే వరంగల్‌కు రూ.5,500 కోట్ల నిధులు మంజూరు చేశాం.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఖమ్మం కంటే వరంగల్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. వరంగల్ అభివృద్ధి చేస్తే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే. అందుకే నగరం అభివృద్ధి జరిగే వరకూ నిద్రపోను. వరంగల్, కొత్తగూడెం, రామగుండెంకు ఎయిర్‌పోర్ట్‌లు రావాల్సి ఉంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్నాం" అని చెప్పారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now