CM Revanth Reddy Reviews South RRR: అటవీ ప్రాంతాల్లో నైట్ సఫారీ,రీజనల్ రింగ్ రోడ్డుపై సీఎం రేవంత్ రివ్యూ, భూ సమీకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు
సాధ్యమైనంత ఎక్కువ పరిహారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పరంగా అదనంగా ఏవిధమైన సహాయం చేయగలమో ఆలోచించి రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేలా అలైన్‌మెంట్ ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం, రేడియల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ రహదారిపై సమీక్ష నిర్వహించారు సీఎం.
Hyd, Aug 29: సౌత్ రీజనల్ రింగ్ రోడ్డుపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సాధ్యమైనంత ఎక్కువ పరిహారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పరంగా అదనంగా ఏవిధమైన సహాయం చేయగలమో ఆలోచించి రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేలా అలైన్‌మెంట్ ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం, రేడియల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ రహదారిపై సమీక్ష నిర్వహించారు సీఎం.
ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రేడియల్ రోడ్లకు భూ సమీకరణ వేగవంతం చేయాలన్నారు. అలాగే డ్రై పోర్ట్.. బందరు-కాకినాడ పోర్టుల అనుసంధానంపై అధ్యయనం చేయాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో నైట్ సఫారీలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.నూతనంగా ఏర్పడనున్న ఫోర్త్ సిటీలో నెలకొల్పనున్న పరిశ్రమలు, వాటిలో పని చేసే అధికారులు, సిబ్బందికి వారి కుటుంబాలకు విద్యా, వైద్య, ఇతర వసతులు అందుబాటులో ఉండేలా అలైన్‌మెంట్ ఉండాలని సూచించారు. ఫోర్త్ సిటీలోని పరిశ్రమలకు అటవీ ప్రాంతాలను అనుసంధానిస్తే అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందంటూ అమెరికాలో యాపిల్ పరిశ్రమ అక్కడ యాపిల్ తోటలోనే ఉన్న అంశాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఈ సందర్బంగా రాచకొండ పరిధిలోని లోయలు... ప్రకృతి సౌందర్యం సినీ పరిశ్రమను ఆకర్షించడానికి ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు.
ప్రతిపాదిత రేడియల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూ సేకరణ చేపట్టాలన్నారు. ఏ రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు భూ సేకరణ చేసేటప్పుడు మానవీయ కోణంతో ఆలోచించాలని, భూ నిర్వాసితులతో సానుభూతితో వ్యవహరించాలన్నారు. డ్రైపోర్ట్ నిర్మాణం విషయంలో మచిలీపట్నం, కాకినాడ రేవులను పరిగణనలోకి తీసుకోవాలని, దూరంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మార్గానికి సుముఖంగా ఉంది, తెలంగాణ ప్రయోజనాలకు ఏరకంగా మేలు జరుగుతుందనే విషయం ప్రాధాన్యతలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ వరకే హైడ్రా, చెరువులు కబ్జా చేసిన ఎవరినీ వదలిపెట్టమన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల ఆక్రమణల నుండే కూల్చివేతలు ప్రారంభమని స్పష్టం
ఓఆర్ఆర్ -ఆర్ఆర్ఆర్ మధ్య రావిర్యాల నుంచి అమన్‌గల్ వరకు నిర్మించనున్న రహదారిలో మూడు చోట్ల ఉన్న అటవీ ప్రాంతాలను నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలన్నారు. బెంగళూర్‌లో జిందాల్ నేచర్ కేర్ పెట్టారని, మనకు ఉన్న అటవీ ప్రాంతం, అనుకూలతలు తెలియజేస్తే అటువంటివి ఎన్నో వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు, ఫోర్త్ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ సమీకరణ, భూ సేకరణ విషయంలో అన్ని శాఖల అధికారులు కలిసి పని చేయాలని, ఫలితాలే లక్ష్యంగా పని తీరు ఉండాలని...ప్రతి సమీక్షకు ప్రగతి కనపడాలని అలా లేకుంటే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడనని ముఖ్యమంత్రి హెచ్చరించారు.